HCA Awards 2023- Ram Charan: అంతర్జాతీయ వేదికపై ఆసక్తికర సంఘటన, స్టేజ్‌పైనే చరణ్‌కు క్షమాపణలు చెప్పిన నటి

25 Feb, 2023 12:36 IST|Sakshi

హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అవార్డుల వేదికపై ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. విశ్వ వేదికపై నటి చరణ్‌ను క్షమాపణలు కోరిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకి ఏం జరిగిందంటే.. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అవార్డుల ప్రదానోత్సవంలో మెరిసిన సంగతి తెలిసిందే. నటి టిగ్‌ నొటారో వ్యాఖ్యాత వ్యహరించిన ఈ కార్యక్రమంలో చరణ్‌ అవార్డ్‌ ప్రజెంటర్‌గా పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా బెస్ట్‌ వాయిస్‌/మోషన్‌ క్యాప్చర్‌ అవార్డును హాలీవుడ్‌ నటి అంజలి భీమానితో కలిసి చరణ్‌ ప్రదానం చేశాడు. ఈ నేపథ్యంలో ఈ ఈవెంట్‌ హోస్ట్‌, హాలీవుడ్‌ నటి టిగ్‌ నొటారో చరణ్‌ను స్టేజ్‌పైకి పిలిచే క్రమంలో అతడి పేరు మరిచిపోయింది. 

చదవండి: వీధి కుక్కల ఘటన: రష్మీని కుక్కతో పోల్చిన నెటిజన్‌, యాంకర్‌ ఘాటు రిప్లై..

ఈ అవార్డు అందించాల్సిందిగా ఆమె చరణ్‌ను స్టేజ్‌పైకి పిలుస్తూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో విజయాన్ని అందుకున్న ఇంటర్నేషనల్‌ సూపర్‌ స్టార్‌ రామ్‌...’ అంటూ తడబడింది. అనంతరం తన పేరు మర్చిపోయా అనడంతో స్టేజ్‌ వెనక ఉన్న బృందం ఆమెకు చరణ్‌ అని మాట అందించారు. ఈ తర్వాత రామ్‌ చరణ్‌ అంటూ పూర్తి పేరు చెప్పి తనకు పక్క నుంచి సాయం చేశారని స్టేజ్‌పై వెల్లడిచింది. అనంతరం నటి అంజలి భీమానీతో కలిసి స్టేజ్‌పై వస్తున్న చరణ్‌ దగ్గరకి ఆమె ప్రత్యేకంగా వెళ్లి క్షమాపణలు చెప్పడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

చదవండి: సూర్య భార్య జ్యోతికలో ఈ టాలెంట్‌ కూడా ఉందా! షాకిచ్చిన నటి

ఈ ప్రతిష్టాత్మక అవార్డును అంతర్జాతీయ స్టేజ్‌పై చరణ్‌ ప్రదానం చేయడంపై మెగా ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే చరణ్‌తో కలిసి అవార్డు ప్రజెంట్‌ చేయడానికి వచ్చిన నటి భీమానీ స్టేజ్‌పై మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేసింది. ‘రామ్‌ చరణ్‌ వంటి స్టార్‌ పక్కన నిలబడి.. ఆయనతో కలిసి ఈ అవార్డును అందించడం చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు అవార్డ్‌ విన్నింగ్‌ మూమెంట్‌’ అంటూ మురిసిపోయింది. కాగా గ్లోబల్‌ లెవల్‌లో ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ ఈ స్టేజ్‌పై ఏకంగా ఐది అవార్డులతో మెరిసింది. ఈ అవార్డులను డైరెక్టర్ రాజమౌళి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి అందుకున్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు