అందం ఇదేనేమో.. త్రిష చీరకట్టు ఫోటోలు వైరల్‌

31 Jul, 2022 09:45 IST|Sakshi

అసలైన అందం ఇదేనంటూ త్రిష ఫొటో సెషన్స్‌పై నెట్‌జన్లు కితాబిస్తున్నారు. ఎప్పుడూ గ్లామర్‌తో మెరిసే త్రిష తాజాగా ఎలాంటి మేకప్‌ లేకుండా సాదాసీదా కాటన్‌ చీర ధరించి పొటోషూట్‌ నిర్వహించింది. ఆ ఫొటోలు కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

అసలైన అందం ఇదేగా అంటూ నెటిజన్లు వాటిని షేర్‌ చేస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు. సహజంగా త్రిష గ్లామరస్‌ దుస్తులతో మెరుపులు మెరిపిస్తూ కనిపిస్తారు. నటిగా 15 ఏళ్లు దాటినా హీరోయిన్‌గా కొనసాగడం సాధారణ విషయం కాదు. ఇటీవల హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాల్లో నటించినా అవి ఆశించిన విజయాలను సాధించలేదు.

దీంతో కథా బలం ఉన్న చిత్రాలను నటించాలని నిర్ణయించుకున్నారు. అలాంటి తరుణంలో మణిరత్నం నుంచి పిలుపు తలుపుతట్టింది. పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలో రాణి కుందవై పాత్రలో నటిస్తున్నారు.

సరైన సమయంలో మణిరత్నం నుంచి ఈ చిత్రం ఆఫర్‌ రావడంతో తాను సది్వనియోగం చేసుకున్నానని అంటోంది ఈ బ్యూటీ. రెండు భాగాలుగా రూపొందుతున్న పొన్నియిన్‌ సెల్వన్‌ తొలి భాగం సెపె్టంబర్‌ 30వ తేదీన విడుదలకు ముస్తాబవుతోంది. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల అవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరిన్ని వార్తలు