Trisha Wedding: 40 ఏళ్ల వయసులో పెళ్లికి సిద్ధమైన త్రిష.. నిజమేనా?

19 Sep, 2023 17:46 IST|Sakshi

హీరోయిన్ త్రిష పెళ్లి చేసుకోబోతుందా? అవును ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే టాక్ వినిపిస్తుంది. 40 ఏళ్ల వయసొచ్చినా సరే పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడు.. ఓ ప్రముఖ నిర్మాతతోనే త్వరలో ఏడడుగులు వేయనుందట. ఇంతకీ ఈ రూమర్‌లో నిజమెంత? సడన్‌గా త్రిష పెళ్లిపై ఎందుకు డిస్కషన్ మొదలైంది?

త్రిష గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'వర్షం' మూవీతో ఈమె హిట్ కొట్టడం మాటేమో గానీ 10-15 ఏళ్లకు పైగా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పింది. అయితే ఆమెకి తగ్గ సినిమాలు పడకపోయేసరికి తెలుగులో ఛాన్సులు తగ్గిపోయాయి. ఇలాంటి టైంలో '96' మూవీ త్రిష కెరీర్‌నే టర్న్ చేసింది.

(ఇదీ చదవండి: టచ్ చేస్తూ ప్రశాంత్ గొడవ.. రతిక మాస్ వార్నింగ్!)

తమిళంలో వచ్చిన ఈ ప్రేమ కథాచిత్రం హీరోయిన్‌గా త్రిషకు మళ్లీ లైఫ్ ఇచ్చింది. దీని తర్వాత పొన్నియిన్ సెల్వన్, లియో లాంటి పాన్ ఇండియా సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది. ప్రస్తుతం మలయాళంలో రెండు, తమిళంలో మూడు మూవీస్ చేస్తున్న త్రిష ఇప్పుడు పెళ్లిపై మనసు పారేసుకుందట. త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనుందట.

ఓ మలయాళ నిర్మాతతో త్రిష త్వరలో ఏడడుగులు వేయనుందట. ప్రస్తుతం ఈ విషయం బయటకు చెప్పనప్పటికీ.. త్వరలో దీని గురించి అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నారట. 2015లో వరుణ్ మణియన్ అనే బిజినెస్‌మ్యాన్‌తో త్రిషకు నిశ్చితార్థం జరిగింది. కానీ ఆ తర్వాత కొన్నిరోజులకు విబేధాలు రావడంతో పెళ్లి చేసుకోలేదు. మరి ఇప్పుడు పెళ్లి అనే వస్తున్న రూమర్స్ నిజమా కాదా తెలియాలంటే కొన్నిరోజులు ఆగితే సరిపోతుంది.

(ఇదీ చదవండి: యువ హీరో తల్లిపై పోలీస్ కేసు.. ఏం జరిగింది?)

మరిన్ని వార్తలు