మరోసారి వార్తల్లో నటి వనితా విజయ్‌కుమార్‌.. నెట్టింట్లో వైరల్‌

16 Jul, 2021 06:33 IST|Sakshi
నోట్ల మాల ధారణతో నటి వనిత పూజ

తమిళ సినిమా: ఎప్పుడూ ఏదో ఒక చర్యతో వార్తల్లో వుండే నటి వనితా విజయ్‌కుమార్‌. ఇప్పటికే మూడుసార్లు పెళ్లి చేసుకుని, ముగ్గురు భర్తలకు విడాకులు ఇచ్చి పలు విమర్శలను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం తన పిల్లలతో కలిసి జీవిస్తున్న వనితా విజయ్‌కుమార్‌ తన భర్త ఎవరని అడుగుతున్నారని ఆవేదనను వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో వనితా విజయకుమార్‌ మరోసారి వార్తల్లో కెక్కారు.

ఆమె తన ఇంటిలో కుబేరుడి పూజ నిర్వహించారు. ఇక్కడ విశేషం ఏమిటంటే వనితా విజయకుమార్, ఆమె కూతురు మెడలో డబ్బు నోట్ల మాలలు ధరించి పూజ నిర్వహించారు. ఆ దృశ్యాలను ఆమె సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి.

మరిన్ని వార్తలు