ఆ టైటిల్‌ విని షాక్‌ అయ్యాను!

21 Nov, 2021 08:30 IST|Sakshi

సంపూర్ణేష్‌ బాబు, వాసంతి జంటగా ఆర్కే మలినేని దర్శకత్వంలో గుడూరు శ్రీధర్‌ సమర్పణలో ఆశాజ్యోతి గోగినేని నిర్మించిన చిత్రం ‘క్యాలీఫ్లవర్‌’. ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా వాసంతి మాట్లాడుతూ – ‘‘నేను తెలుగు అమ్మాయినే కానీ బెంగళూరులో చదువుకున్నాను. ఏరో నాటికల్‌ ఇంజనీర్‌ అవుదామనుకున్న నేను హీరోయిన్‌ అయ్యాను. ఐదు సంవత్సరాల క్రితం మోడల్‌గా నా కెరీర్‌ను స్టార్ట్‌ చేసి, ఆ తర్వాత నటి  అయ్యాను. కన్నడంలో ఐదు సినిమాలు చేశాను. ఇప్పుడు ‘క్యాలీఫ్లవర్‌’తో తెలుగు చిత్రపరిశ్రమకు వస్తున్నాను. ఇందులో హీరోగా నటించిన సంపూర్ణేష్‌ బాబుకు మరదలిగా, నీలవేణి క్యారెక్టర్‌ చేశాను. 

ఈ క్యారెక్టర్‌ నా కోసమే డిజైన్‌ చేశారా? అన్నట్లు నాకనిపించింది. కొందరిలా నేను కూడా ‘క్యాలీఫ్లవర్‌’ టైటిల్‌ విని షాకయ్యాను. కానీ సస్పెన్స్, థ్రిల్, కామెడీ, మెసేజ్‌ ఉన్న ఈ చిత్రం ఆడియన్స్‌కు నచ్చుతుంది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేయాలని ఉంది. హీరో నానీగారంటే ఇష్టం. ఆయనతో వర్క్‌ చేయాలని ఉంది. ప్రస్తుతం ఆది సాయికుమార్, మారుతి అండ్‌ టీమ్‌ సినిమాల్లో లీడ్‌ రోల్స్‌ చేస్తున్నాను. కన్నడంలో కొత్త సినిమాలు కమిట్‌ కాలేదు’’ అన్నారు. 

మరిన్ని వార్తలు