Actress Yamuna Interview: అందుకే నాకు ఫైర్‌ బ్రాండ్‌ ఇమేజ్‌!

4 Nov, 2021 13:37 IST|Sakshi

‘‘ప్రతీ ఒక్కటీ రాసిపెట్టిందే’’ అంటున్నారు నటి యమున. ఇంకా ‘సాక్షి’ టీవీతో ఆమె చెప్పిన విశేషాలు ఈ విధంగా.. తొలిసారి బాలచందర్‌గారి సినిమాలో చేశాను. ఆ సినిమా తర్వాత సరైన ఆఫర్లు రాలేదు. పొట్టిగా ఉన్నానని చిన్న పాత్రలు ఇస్తామన్నారు. హీరోయిన్‌గానే చేస్తానన్నాను. నా నటన చూసి ‘మౌన పోరాటం’లో ఆఫర్‌ ఇచ్చారు. ఇబ్బంది అనిపించినా ఆ సినిమాలో బ్లౌజ్‌ లేకుండా చేశాను.

⇒ కోపమొచ్చినా, సంతోషమొచ్చినా చూపిం చేస్తాను. ఏదీ మనసులో పెట్టుకోను. ఆ తత్వమే ఫైర్‌బ్రాండ్‌ ఇమేజ్‌ ఇచ్చింది.

⇒ చిరంజీవితో ‘కొదమ సింహం’, మోహన్‌బాబుతో ‘అల్లుడుగారు’, బాలకృష్ణతో ఓ సినిమా, రాజశేఖర్, శరత్‌కుమార్, మోహన్‌లాల్‌లతో.. ఇలా చాలా సినిమాలు మిస్సయ్యా. స్టార్‌ హీరోయిన్‌ కాలేదనే బాధ ఉంది.  ఇప్పుడు సీరియల్స్‌లో బిజీగా ఉన్నందుకు హ్యాపీ.

⇒ ఎవరెవరినో నా భర్త అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌  చేయకండి. నేను ఒక్కర్నే పెళ్లి చేసుకున్నా (నవ్వుతూ). కావాలంటే నన్ను అడగండి.. ఫ్యామిలీ ఫొటోస్‌ పంపిస్తా. నా భర్త పేరు జయంత్‌కుమార్‌. ఆయన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. 

మరిన్ని వార్తలు