Yamuna Home Tour: నెల రోజుల్లో నటి యమున రెండో హోమ్‌ టూర్‌

13 Jan, 2022 21:21 IST|Sakshi

Actress Yamuna New Home Tour: బుల్లితెర ప్రేక్షకులకు మాత్రమే కాదు వెండితెర ఆడియన్స్‌కు కూడా బాగా సుపరిచితురాలు నటి యమున..ప్గతంలో పలు సినిమాల్లో నటించిన ఆమె తర్వాత టీవీ ఇండస్ట్రీలో కాలు మోపింది. అనేక సీరియళ్లలో నటిస్తూ బుల్లితెరపై స్థిరపడిపోయింది. ఎంతోమంది నటీనటులు వస్తూపోతున్నా యమున మాత్రం పోటీని తట్టుకుని ఇండస్ట్రీలో నిలబడింది.

సోషల్‌ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే యమున ఆ మధ్య హోమ్‌ టూర్‌ వీడియో చేసింది. దీన్ని పదిహేను లక్షల మంది వీక్షించారు. ఈ వీడియో పెట్టి నెల రోజులైందో లేదో మరో హోమ్‌ టూర్‌ వీడియో చేసింది యమున. భవిష్యత్తులో రిటైర్మెంట్‌ తీసుకున్నాక ప్రశాంతంగా గడిపేందుకు వీలుగా హైదరాబాద్‌ సిటీకి దూరంగా స్థలాన్ని కొనుగోలు చేసింది. మహేశ్వరం ప్రాంతంలో 360 గజాల్లో స్థలం సొంతం చేసుకుని తనకు నచ్చినట్లుగా ఇంటిని నిర్మించుకుంది.

హాల్‌, పూజ గది, కిచెన్‌, డైనింగ్‌ ఏరియా, 3 బెడ్‌ రూమ్స్‌, ఒక ఆఫీస్‌ రూమ్‌ ఇలా అన్నింటినీ చూపించింది. భవిష్యత్తులో లిఫ్ట్‌ ఏర్పాటు చేసేందుకు వీలుగా కొంత ఖాళీ స్థలాన్ని ఉంచానంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇల్లు సింపుల్‌గా బాగుందని కామెంట్లు చేస్తున్నారు. ప్రశాంత వాతావారణంలో ఇల్లు కట్టుకోవడమే కాక అందంగా, నీట్‌గా డిజైన్‌ చేశారని మెచ్చుకుంటున్నారు.

మరిన్ని వార్తలు