సమాధానం ఏంటి?

2 Sep, 2020 02:39 IST|Sakshi

అదా శర్మ లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘క్వశ్చన్‌ మార్క్‌ (?)’. విప్రా దర్శకత్వంలో గౌరు ఘనా సమర్పణలో శ్రీకృష్ణ క్రియేషన్స్‌ పతాకంపై గౌరీకృష్ణ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవల పూర్తయింది. ఈ సందర్భంగా గౌరీకృష్ణ మాట్లాడుతూ– ‘‘కరోనా సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని అందరి సహకారంతో సినిమా షూటింగ్‌ పూర్తి చేశాం. మా టైటిల్‌ ‘క్వశ్చన్‌ మార్క్‌ (?)’కి విశేష స్పందన లభించింది’’ అన్నారు. ‘‘మా నిర్మాతగారు ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు విప్రా. ‘‘చక్కని హారర్‌ సినిమా ఇది. ‘క్వశ్చన్‌ మార్క్‌ (?)’ టైటిల్‌ పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ప్రశ్నకు సమాధానం ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే’’ అన్నారు అదా శర్మ. ఈ చిత్రానికి కెమెరా: వంశీ ప్రకాష్, సంగీత దర్శకుడు: రఘు కుంచె. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు