పక్కా  మాస్‌

21 Nov, 2023 03:23 IST|Sakshi

‘‘ఆదికేశవ’ సినిమా ట్రైలర్‌కి వస్తున్న స్పందన చూసి చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులు మెచ్చే చిత్రాన్ని అందించడం కోసం మేమంతా ఎంతో కష్టపడ్డాం. ట్రైలర్‌లానే సినిమా కూడా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’’ అని హీరో వైష్ణవ్‌ తేజ్‌ అన్నారు. శ్రీకాంత్‌ ఎన్‌. రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్‌ తేజ్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఆదికేశవ’.

సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ ‘‘ఆదికేశవ’ పక్కా మాస్‌ చిత్రం. ఇందులో యాక్షన్, ఎమోషన్, కామెడీ, సాంగ్స్‌.. ఇలా అన్నీ బాగుంటాయి. గతేడాది వచ్చిన ‘వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి’ చిత్రాల తర్వాత ఈ ఏడాది వస్తున్న పర్ఫెక్ట్‌ మాస్‌ మూవీ ‘ఆదికేశవ’’ అన్నారు. 

మరిన్ని వార్తలు