Kriti Sanon: ఆదిపురుష్ సినిమా కాదు.. అంతకుమించి: కృతిసనన్

6 Feb, 2023 15:18 IST|Sakshi

బాలీవుడ్ నటి కృతి సనన్ ఇటీవల బాలీవుడ్ సినిమాలతో బిజీగా మారిపోయింది భామ. ఆ తర్వాత ప్రభాస్ సరసన మైథలాజికల్ ఫిల్మ్ ఆదిపురుష్‌లో నటిస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న పాన్-ఇండియా పౌరాణిక ఇతిహాసం ఆదిపురుష్‌లో సీత పాత్రలో కనిపించనుంది. అయితే తాజాగా ఒక ప్రముఖ  సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృతి సనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆదిపురుష్ చిత్రబృందంతో పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని.. ప్రేక్షకులు తనను వారితో సమానంగా గుర్తిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు.

ఇక ఈ సినిమాలో సీత పాత్ర తనకెంతో నచ్చిందని కృతి సనన్‌ పేర్కొంది. తన చిన్నతనంలో రామానంద్ సాగర్  సూపర్ హిట్‌గా నిలిచిన దూరదర్శన్ సిరీస్ 'రామాయణ్'ని చూడలేకపోయానని తెలిపింది. అయితే ఈ చిత్రం యువతరానికి నచ్చుతుందని ఆశిస్తున్నట్లు వివరించారు. ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఒక విజువల్‌ వండర్‌గా అలరిస్తుందని ఆమె పేర్కొంది. 

కృతి సనన్ మాట్లాడుతూ..' ఆదిపురుష్ లాంటి సినిమా చేయడం చాలా ముఖ్యం. ఇలాంటి సినిమాలతో పిల్లలకు విజ్ఞానం పెరుగుతుంది. విజువల్ మెమరీ అన్నిటికంటే బలంగా ఉంటుందని నేను భావిస్తున్నా. ఇలాంటి ఇతిహాసాన్ని పిల్లలకు తెలియజేయడానికి ఉత్తమ మార్గం. వారి మనస్సులో రామాయణాన్ని ముద్రించటం చాలా ముఖ్యం.' అని అన్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల కాగా.. ఊహించని రీతిలో అభిమానులు నుంచి వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో రానున్న ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్‌, సీతగా కృతి సనన్‌, రావణాసురుడిగా సైఫ్‌ అలీఖాన్‌ నటించారు.  ఈ చిత్రాన్ని జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.


మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు