‘ఆదిపురుష్’ డైరెక్టర్‌ కండీషన్‌‌

1 Apr, 2021 08:08 IST|Sakshi

ముంబయ్‌లో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. పలువురు బాలీవుడ్‌ స్టార్స్‌ కరోనా బారిన పడుతున్నారు. దీంతో ‘ఆదిపురుష్‌’ టీమ్‌ సెట్‌లో కరోనా సోకకుండా ఉండేలా స్పెషల్‌ కేర్‌ తీసుకుంటున్నారు. షూటింగ్‌ స్పాట్‌లో పాతికమందికంటే ఎక్కువ సిబ్బంది ఉండకూడదని కండీషన్‌ పెట్టారు ఈ చిత్ర దర్శకుడు ఓం రౌత్‌. అలాగే షూటింగ్‌కి ప్యాకప్‌ చెప్పగానే సెట్‌ మొత్తాన్ని శానిటైజ్‌ చేయిస్తున్నారు.

ఇలా కరోనా కండీషన్స్, జాగ్రత్తల మధ్య ‘ఆదిపురుష్‌’ మూవీ షూటింగ్‌ ఊపందుకుంది. ముంబయ్‌లో జరుగుతున్న ఈ సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ వచ్చే నెల రెండోవారం వరకూ జరుగుతుంది. ‘ఆదిపురుష్‌’లో ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. హీరోయిన్‌గా కృతీ సనన్, విలన్‌గా సైఫ్‌ అలీఖాన్, కీలక పాత్రలో సన్నీ సింగ్‌ నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు