ఆదిపురుష్‌ షూటింగ్‌లో ప్రభాస్‌ పాల్గొనడం లేదు! ఎందుకోసం..!

27 Aug, 2021 23:13 IST|Sakshi
∙ప్రభాస్‌ 

ఆదిపురుష్‌’ సినిమా కోసం హీరో ప్రభాస్‌ ముంబైలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్‌ షూటింగ్‌లో పాల్గొనడం లేదు! మరేం చేస్తున్నారు? అంటే డ్యాన్సింగ్‌ టైమ్‌ అంటూ రిహార్సల్స్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో ఓ భారీ బడ్జెట్‌ సాంగ్‌ ఉందట. ఈ  పాట కోసమే ప్రభాస్, కృతీ సనన్, సైఫ్‌ అలీఖాన్‌ రిహార్సల్స్‌ చేస్తున్నారని సమాచారం. నాలుగు రోజులుగా ఓ స్టూడియోలో రిహార్సల్స్‌ జరుగుతున్న ఈ సాంగ్‌ షూట్‌ను మరో వారంలో పూర్తి చేయనున్నారట చిత్రదర్శకుడు ఓం రౌత్‌. ఇది ప్రమోషనల్‌ సాంగ్‌ అని సమాచారం. ఈ పాట పూర్తయ్యాక ప్రభాస్, సైఫ్, కృతీ కాంబినేషన్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్‌ చేశారట. ఈ మైథాలజీ ఫిల్మ్‌లో రాముడి పాత్రలో ప్రభాస్, సీతగా కృతీ సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, రావణుడిగా సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు