Adipurush Ravan Look: రావణుడిని అందుకే అలా డిజైన్ చేశారు: నిర్మాత వివేక్

19 Jun, 2023 16:28 IST|Sakshi

ప్రభాస్ 'ఆదిపురుష్' థియేటర్లలో సంచలనాలు సృష్టిస్తోంది. టాక్ తో సంబంధం లేకుండా మూడు రోజుల్లోనే రూ.340 కోట్లు కలెక్షన్స్ సాధించి, రికార్డులు తిరగరాస్తోంది. అదే టైంలో ఈ సినిమాలో పాత్రలు, వాటి గెటప్స్ పై ఇప్పటికే ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా రావణుడి లుక్ పై ఘోరంగా విమర్శలు వస్తున్నాయి. అసలు రావణుడి పాత్ర ఎందుకు అలా డిజైన్ చేయాల‍్సి వచ్చిందనేది నిర్మాత వివేక్ కూచిభొట్ల ఇప్పుడు కాస్త క్లారిటీ ఇచ్చే ప‍్రయత్నం చేశారు.  

టీ సిరీస్ సంస‍్థ నిర్మించిన 'ఆదిపురుష్'ని తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పంపిణీ చేసింది. దాదాపు రూ.185 కోట్లు పెట్టి హక్కుల్ని కొనుగోలు చేసింది. సరే అదంతా పక్కనబెడితే మూడురోజుల్లో అంటే ఆదివారం వరకు ఈ సినిమాను కోటి మందికి పైగా చూశారు. దీంతో 'రామకోటి ఉత్సవం' పేరిట హైదరాబాద్ లో సోమవారం ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులోనే  పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత వివేక్ కూచిభొట్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీలోకి 22 సినిమాలు.. ఆ ఒక్కటి మాత్రం!)

'చిన్నపిల్లలకు అర్థమయ్యేలా ఓ సినిమా తీయాలి. రామాయణం అంటే పాతకాలంలాగా సంస్కృత పద్యాలు, డైలాగ్స్ తో సినిమా తీస్తే.. అప్డేట్ అవ్వండ్రా అని మీరే అంటారు. ఇప్పుడేమో అప్డేట్ అయి సినిమా తీస్తే.. మళ్లీ రావణాసురుడు ఏంటి ఇలా ఉన్నాడు? వాళ్లేంటి ఇలా ఉన్నారు? వీళ్లేంటి ఇలా ఉన్నారని అంటున్నారు. మీరు చూడలేదు, మేము చూడలేదు. మీ ఊహకు రావణాసురుడిని ఒకలా ఊహించుకున్నారు. మా ఊహకు రావణాసురుడిని ఒకలా ఊహించుకున్నాం.'

'కానీ ఈ సినిమాలో ఎక్కడా చరిత్రని తప్పుదోవ పట్టించలేదు. రాముడు ధీరోదాత‍్తుడు, సకలాగుణాభిరాముడు అనే చూపించారు. మంచి చెప్పడానికి.. ఈ రోజు పిల్లలకు అర్థమయ్యేటట్టు.. అంటే ఈ రోజు పిల్లలని తీసుకుంటే థార్, హల్క్, డిస్నీ క్యారెక్టర్స్ అన్నీ తెలుసు. కానీ వాళ్లకు జాంబవంతుడు, సుగ్రీవుడు, అంగదుడు అంటే ఎవరో తెలుసా? తెలియదు. బ్యాట్ మ్యాన్ ఫొటో చూపిస్తే వెంటనే గుర్తుపడతారు. అంగదుడిని గుర్తుపట్టలేరు. ఈ రకంగా అయినా మన పిల్లలకు రామాయణంలోని పాత్రలు పిల్లలకు తెలిసే అవకాశముంటుంది' అని నిర్మాత వివేక్ కూచిబొట్ల చెప్పుకొచ్చారు. 

(ఇదీ చదవండి: ‘ఆదిపురుష్‌’ ఎఫెక్ట్‌.. అక్కడ భారత్​ సినిమాలపై నిషేధం!)

మరిన్ని వార్తలు