ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ఎన్నికల్లో ఆదిశేషగిరిరావు ఘన విజయం

25 Sep, 2022 21:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ క్లబ్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరిరావు మరోసారి ఎఫ్ఎన్‌సీసీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌పై తుమ్మల రంగారావు విజయం సాధించారు.

ప్రతీ రెండేళ్లకోసారి ఫిల్మ్ నగర్ క్లబ్‌కు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. మొత్తం 4 వేల 600మంది సభ్యులున్న ఈ సెంటర్‌లో 1900 మందికి ఓటు హక్కు ఉంది. వారిలో మెజార్టీ సభ్యులైన నిర్మాతలు, దర్శకులు, ఇతర ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అల్లుఅరవింద్ , సురేష్ బాబు, కేఎల్ నారాయణ ప్యానెల్‌లోని సభ్యులే గెలుపొందారు.

చదవండి: (డాటర్స్‌ డే స్పెషల్.. కూతురికి మహేశ్​ స్పెషల్​ విషెష్)

మరిన్ని వార్తలు