మహా సముద్రంలో..

20 Oct, 2020 03:28 IST|Sakshi

శర్వానంద్, సిద్ధార్థ్‌ హీరోలుగా ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం’. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. అదితీ రావ్‌ హైదరీ ఒక హీరోయిన్‌గా నటించనున్నట్లు ఇటీవల ప్రకటించారు. మరో హీరోయిన్‌ పాత్రలో అనూ ఇమ్మాన్యుయేల్‌ను ఎంపిక చేసినట్లు సోమవారం ప్రకటించింది చిత్రబృందం. యాక్షన్‌ లవ్‌ డ్రామాగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి సుంకర రామబ్రహ్మం నిర్మాత. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు