నటిని వివాహమాడిన సింగర్‌!

2 Dec, 2020 08:39 IST|Sakshi

ముంబై: ప్రముఖ గాయకుడు ఉదిత్‌ నారాయణ్‌ కుమారుడు, నటుడు ఆదిత్య నారాయణ్‌ ఓ ఇంటివాడయ్యాడు. చిరకాల స్నేహితురాలు, నటి శ్వేత అగర్వాల్‌ను మనువాడి వివాహ బంధంలో అడుగుపెట్టాడు. ముంబైలోని ఇస్కాన్‌ టెంపుల్‌లో మంగళవారం వీరి పెళ్లి జరిగింది. కోవిడ్‌-19 నిబంధనల నేపథ్యంలో ఇరు కుటుంబాల సన్నిహితులు మాత్రమే ఈ శుభకార్యానికి హాజరయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. (చదవండి: ‘నేను స్త్రీలోలుడిని అని భయపడింది’)

ఈ క్రమంలో వధూవరులు ఆదిత్య, శ్వేతతో పాటు బంధువులు సరదాగా గడిపిన వీడియోలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా పెళ్లికొడుకు తల్లి దీపా నారాయణ్‌ బారాత్‌లో కొడుకుతో కలిసి సందడి చేసిన దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి. కాగా సింగర్‌, టీవీ షోల హోస్ట్‌గా అందరికీ సుపరిచితమైన ఆదిత్య నారాయణ్‌, శ్వేత అగర్వాల్‌తో కలిసి ‘షాపిత్‌’ అనే సినిమాలో నటించాడు. షూటింగ్‌లో భాగంగా ఈ జంట మధ్య స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలో పదేళ్ల పాటు ప్రేమించుకున్న వీరు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇరు కుటుంబాలను ఒప్పించి మంగళవారం పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.  (చదవండి: అవును.. పెళ్లిచేసుకోబోతున్నాం)

A post shared by Saroj_Mahara (@saroj_maharaa)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా