‌అడవి శేష్‌ ‘మేజర్‌’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌..!

17 Dec, 2020 10:46 IST|Sakshi

26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలర్పించిన యంగ్‌ ఆర్మీ ఆఫీసర్‌ సందీప్‌ ఉన్ని కృష్షన్‌ జీవితం ఆధారంగా ‘మేజర్’‌ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అడవి శేష్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఇక ఈ రోజు తన బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ధైర్య సాహసాలు ప్రతిబింబించేలా `మేజర్` ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించింది చిత్ర యూనిట్‌. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌ లుక్‌లో అడివి శేష్‌ను ప్రదర్శిస్తూ ఈ రోజు ఉద‌యం 10 గంట‌ల‌కు `మేజర్` ఫ‌స్ట్‌లుక్ పోస్టర్‌ను విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌. 

26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జ‌ర్నీని ప్రేక్ష‌కుల‌కుకి అందించ‌డ‌మే ఈ చిత్రం ముఖ్య ఉద్ధేశ్యం అని తెలిపారు దర్శకుడు. అతడు వీర మ‌ర‌ణం పొందిన విధానం మాత్రమే కాకుండా, అతను జీవించిన విధానం ఆత్మను సంగ్రహించే సన్నివేశాలను ఈ చిత్రం ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తోంది చిత్ర యూనిట్‌. 27/11న మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ వ‌ర్ధంతి సందర్భంగా హీరో అడివి శేష్ ‌లుక్ టెస్ట్ పోస్ట‌ర్‌‌తో పాటు, అమరవీరుల జ్ఞాపకాలకు నివాళులు అర్పిస్తూ సినిమా తీసే ప్రయాణాన్ని గురించి‌ వెల్లడించే వీడియోను రిలీజ్ చేసిన‌ విష‌యం తెలిసిందే.(ఆయన కళ్లల్లో ప్యాషన్‌ కనిపించింది– అడివి శేష్‌)

మేజర్ టీమ్ ఆగష్టులో కోవిడ్ సమయంలో అవ‌స‌ర‌మైన అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఇప్పటి వరకు 70శాతం షూట్ పూర్తి చేసింది. పాన్ ఇండియా మూవీగా  తెలుగు, హిందీ భాషలలో రూపొందుతోన్న‌ ఈ సినిమాకి  శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తుండగా..  తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ త‌దిత‌రులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మిస్తోన్న మేజర్ చిత్రాన్ని 2021 స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా రిలీజ్ చేయ‌నున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు