సర్‌ప్రైజ్‌కు రెడీ అయిన అడవి శేష్‌.. బిగ్‌ అప్‌డేట్‌ ఈ నెలలోనే..

4 Aug, 2021 10:11 IST|Sakshi

అడివి శేష్‌ కెరీర్‌లో ఓ బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘గూఢచారి’. ఈ చిత్రానికి శశికిరణ్‌ తిక్క దర్శకత్వం వహించారు. ‘గూఢచారి’ సినిమా విడుదలై మంగళవారం (ఆగస్ట్‌ 3) నాటికి మూడేళ్లు పూర్తయ్యాయి. ‘‘నాకు చాలా ఇష్టమైన సినిమా ఇది. ముఖ్యంగా ఈ సినిమాను పిల్లలు ఇష్టపడి చూశారు. ఆగస్టు నెల నాకు బాగా కలిసొస్తోంది. ఈ నెలలోనే నా  తర్వాతి  సినిమా ‘గూఢచారి 2’కు సంబంధించిన అతి పెద్ద అప్‌డేట్‌ తెలియజేస్తాను’’ అని అడివి శేష్‌ ట్వీట్‌ చేశారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అడివి శేష్‌ ‘మేజర్‌’ సినిమాలో నటిస్తున్నారు. ‘హిట్‌ 2’ కూడా కమిట్‌ అయ్యారు.

మరిన్ని వార్తలు