Major Movie: అడవి శేష్​ 'మేజర్​' ట్రైలర్​ వచ్చేది అప్పుడే..

4 May, 2022 15:59 IST|Sakshi

Adivi Sesh Major Movie Trailer Release Date Announced: దేశం కోసం పోరాడిన చరిత్రకారుల్లో ‘మేజర్‌ సందీప్‌ కృష్ణన్‌’ ఒకరు. 26/11 ముంబయ్‌ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్‌ ఆర్మీ ఆఫీసర్‌ ‘సందీప్‌ ఉన్నికృష్ణన్‌’ జీవిత కథతో రూపొందిన చిత్రం ‘మేజర్‌’. సందీప్‌ పాత్రను యంగ్‌ హీరో అడివి శేష్‌ పోషించాడు. శశికిరణ్‌ తిక్క దర్శకత్వంలో పాన్‌ ఇండియన్‌ మూవీగా రూపొందిన ఈ చిత్రం జూన్‌ 3న మేజర్‌ విడుదలవుతున్నట్లు ఇటీవల చిత్రయూనిట్‌ ప్రకటించింది.

ఈ క్రమంలో 'మేజర్'​ సినిమా ట్రైలర్​ విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. ఓ వీడియో రూపంలో మే 9న ఈ మూవీ ట్రైలర్​ను రిలీజ్​ చేయనున్నట్లు తెలిపారు. సూపర్ స్టార్ మహేశ్​ బాబు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు శ్రీచరణ్​ పాకాల సంగీతాన్ని అందించారు. చిత్రంలో హీరోయిన్లుగా సయూ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ కనిపించనున్నారు. ఓ ప్రత్యేకమైన పాత్రలో రేవతి అలరించనున్నారు. 

చదవండి: ప్రజలను ప్రేమించడమే దేశభక్తి!

మరిన్ని వార్తలు