అల్లరి అర్హ.. సోదరుడి భూజాలపై అలా.. క్యూట్‌ పిక్‌ వైరల్‌

18 Jun, 2021 17:20 IST|Sakshi

అల్లు అర్జున్‌ సతీమణి అల్లు స్నేహ సోషల్‌ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. బన్నీతో పాటు తన పిల్లలు అయాన్‌, అర్హలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. ఆమె షేర్‌ చేసిన వీడియోలు, ఫోటోలు వైరల్‌ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే  అతి తక్కువ సమయంలోనే ఇన్‌స్టాలో ఆమెను 4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

ఇదిలా ఉంటే..తాజాగా అల్లు స్నేహ ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఓ క్యూట్‌ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఆ ఫోటోలో అల్లు అయాన్‌ తన సోదరి అర్హని భూజాన ఎత్తుకొని తిప్పుతున్నాడు. ఇక అన్నయ్య భూజాన ఎక్కిన అర్హ.. నవ్వుతూ  ఫోటోకి ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. ‘క్యూట్‌ బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌​’, ‘అన్నా,చెల్లిల ప్రేమ అంటే ఇదే’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)

చదవండి:
అల్లు అర్జున్‌ సతీమణి స్నేహ సరికొత్త రికార్డు 
అప్పుడు నా బరువు జాతీయ సమస్యలా మారింది: హీరోయిన్‌

మరిన్ని వార్తలు