Dahlia Sky: స్టేజ్‌ 4 బ్రెస్ట్‌ క్యాన్సర్‌.. కారులో శవమై తేలిన పోర్న్‌ స్టార్‌

18 Jul, 2021 13:33 IST|Sakshi

Porn Star Dahlia Sky: పోర్న్‌ స్టార్‌ డహ్లియా స్కై (31) ఆత్మహత్య చేసుకుంది. తన కారులో తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు వదిలింది. కాలిఫోర్నియాలోని లాస్‌ ఏంజిల్స్‌లో రెండు వారాల క్రితం ఈ సంఘటన జరగ్గా.. తాజాగా​ ఈ విషయాన్ని అధికారులు ధృవీకరించారు. జూన్‌ 30న శాన్‌ ఫెర్నాండో వ్యాలీలోని ఓ కారులో డహ్లియా నిర్జీవంగా కనిపించిందని మీడియాకు వెల్లడించారు. అక్కడున్న దృశ్యాన్ని బట్టి ఆమెది ఆత్మహత్యేనని పేర్కొన్నారు. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

కాగా 2010లో అడల్ట్‌ స్టార్‌గా కెరీర్‌ ఆరంభించిన డహ్లియా సుమారు పదేళ్లు పోర్న్‌ స్టార్‌గా రాణించింది. ప్రస్తుతం ఆమె స్టేజ్‌ 4 బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఈ క్రమంలోనే ఆమె డిప్రెషన్‌కు లోనై సూసైడ్‌ చేసుకుని ఉండొచ్చని అభిమానులు భావిస్తున్నారు. వచ్చే నెలలో(ఆగస్టు 10న) బర్త్‌డే జరుపుకోవాల్సిన డహ్లియా ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. పిన్న వయసులోనే ఈ లోకాన్ని వదిలి వెళ్లిన ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు.

డహ్లియా మరణం గురించి నిర్మాత హాన్స్‌ మాట్లాడుతూ.. 'గతేడాది ఆమెతో జీవితం గురించి చాలాసార్లు మాట్లాడాను. కానీ నిజంగా ఆ జర్నీ అంత సులభం కాదని తెలుసు. ఎంతో సరదాగా, సహృదయంతో మెదిలే నా స్నేహితురాలిని నేను చాలా మిస్‌ అవుతున్నాను' అని ఎమోషనల్‌ అయ్యాడు.

మరిన్ని వార్తలు