ఆలోచింపచేసేలా ‘ఏవమ్ జగత్‌’టీజర్

5 Nov, 2021 20:38 IST|Sakshi

కిరణ్ గేయ, ప్రకృతివనం ప్రసాద్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేషమ్, ఇనయ సుల్తానా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఏవం జగత్‌’.దినేష్ నర్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ని మార్స్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై ముణిరత్నం నాయుడు ఎన్, రాజేశ్వరి ఎన్ నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాలోని  రాధాస్ లవ్ అనే సాంగ్ విడుదల కాగా ప్రేక్షకులనుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటుంది ఈ పాట.  

తాజాగా ఈ సినిమా టీజర్ ను  ప్రముఖ దర్శకుడు దేవాకట్టా విడుదల చేశాడు. ప్రతి ఒక్కరిని ఆలోచింజచేసేలా ఈ టీజర్‌ ఉంది. . డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెరిగేలా ఉన్నాయి.  నటీనటులు కూడా ఎంతో ఇంటెన్స్ తో కూడిన నటన ను కనపరిచినట్లు టీజర్ ను బట్టి తెలుస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని విడుదల కు సిద్దం గా ఉంది .ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.

మరిన్ని వార్తలు