అమీర్‌ ఖాన్‌ ఫోటోను షేర్‌ చేస్తూ.. వాడికి చిక్కామంటూ ట్వీట్‌

25 Mar, 2021 16:55 IST|Sakshi

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు ప్రముఖ నటీనటులకు సైతం కరోనా సోకతుంది. తాజాగా నటుడు మాధవన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా మాధవన్‌ సోషల్‌ మీడియాలో వెల్లడించారు. అయితే కరోనా సోకిందనే విషయాన్ని కాస్త ఫన్నీగా షేర్‌ చేసుకున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ అమీర్‌ ఖాన్‌తో 'త్రీ ఇడియట్స్' చిత్రంలో కలిసి నటించిన మాధవన్‌..అందులోని ఓ  ఫోటోను షేర్‌ చేస్తూ..రాంచో(3 ఇడియ‌ట్స్ లో  అమీర్‌ పాత్ర పేరు)ను ఫ‌ర్హాన్( మాధ‌వన్‌ పేరు) ఫాలో అవుతుంటే.. వైర‌స్(బొమ‌న్ ఇరానీ) మా ఇద్ద‌రి వెంట ప‌డేవాడు.


అయితే ఈసారి వాడికి(క‌రోనా వైర‌స్‌కు) మేము చిక్కాము. ఆల్ ఈజ్ వెల్. త్వరలోనే  కరోనా వైర‌స్‌కి కూడా త్వ‌ర‌లో చెక్ ప‌డుతుంది. మాతో పాటు రాజు రాకూడ‌ద‌ని అనుకుంటున్నాము. అంద‌రికీ థ్యాంక్స్. నా ఆరోగ్యం బావుంది అని మాధవన్‌ పేర్కొన్నారు. అయితే కరోనా విషయంలోనూ మాధవన్‌ చూపించిన సెన్సాఫ్ హ్యూమర్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. కాగా బుధవారం నటుడు అమీర్‌ ఖాన్‌..తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇంటి వద్దే ఐసోలేషన్‌లో ఉన్నట్లు, ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని అతని మేనేజర్‌ తెలిపారు. 

చదవండి : ప్రపోజ్‌ డే: హీరోకు వెరైటీ లవ్‌ ప్రపోజల్‌
వామ్మో! షారుక్‌కు అంత రెమ్యునరేషన్‌ కావాలంట

మరిన్ని వార్తలు