Swara Bhasker : మళ్లీ పెళ్లికి సిద్ధమైన బాలీవుడ్‌ నటి.. వెడ్డింగ్‌ కార్డ్‌ వైరల్‌

7 Mar, 2023 12:49 IST|Sakshi

బాలీవుడ్‌ హీరోయిన్‌ స్వరభాస్కర్‌ ఫహద్ అహ్మద్ అనే రాజకీయ నేతను సీక్రెట్‌గా పెళ్లాడిన సంగతి తెలిసిందే. జనవరి 6న అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరు రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా స్వరభాస్కర్‌ మరోసారి పెళ్లికి సిద్ధమైంది.

తాను ప్రేమించిన ఫహద్‌ అహ్మద్‌నే మరోసారి పెళ్లాడనుంది. ఇటీవల వీరిద్దరూ రిజిస్టర్‌ మ్యారేజ్‌ తాజాగా మరోసారి సాంప్రదాయబద్దంగా వివాహం చేసుకోనున్నారు. ఈనెల 11నుంచి హల్దీ, మెహందీ, సంగీత్‌ ఇలా పెళ్లి వేడుకలు జరగనున్నాయి.

ఢిల్లీలోని స్వరభాస్కర్‌ అమ్మమ్మ ఇల్లు వీరి పెళ్లివేదిక కానుంది. ఈనెల 15-16 తేదీల్లో ఇరు కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో స్వరభాస్కర్‌వివాహం ఘనంగా జరనుంది. దీనికి సంబంధించిన వెడ్డింగ్‌ కార్డ్‌ ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. 


 

A post shared by Prateeq Kumar (@prateeq)

మరిన్ని వార్తలు