బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ భన్సాలీతో ఎన్టీఆర్‌32వ సినిమా?

19 May, 2021 20:52 IST|Sakshi

ప్రస్తుతం ఎన్టీఆర్‌ రాజమౌళితో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్‌ వాయిదా పడింది. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్‌తో సినిమా అనౌన్స్‌ చేసినా కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ ఆగిపోయింది. దీంతో ఎన్టీఆర్‌ కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్‌ తన 30వ సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌నీల్‌తో సినిమా చేయనున్నాడు. వరుసగా  పాన్ ఇండియా డైరెక్టర్ల సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న ఎన్టీఆర్ తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ సంజయ్ లీలా భన్సాలీతో సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇందుకు సంబంధించి దాదాపు ఏడాది నుంచి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

‘రామ్ లీల’,‘భాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీస్ తీసిన బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ప్రస్తుతం ప్రస్తుతం ఆలియాభట్‌తో గంగూబాయ్‌ కతియావాడి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత తారక్‌తో ప్రాజెక్టును పట్టాలెక్కించున్నాడని బాలీవుడ్‌ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో ఎన్టీఆర్ 32వ సినిమాకు డైరెక్టర్ భన్సాలీనే అంటూ టాక్‌ వినిపిస్తోంది. దీనిపై ఇంతవరకు అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రాలేదు కానీ అభిమానుల్లో ఇప్పటికే ఈ మూవీపై హైప్‌​​​ క్రియేట్‌ అయ్యింది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది తేలాల్సి ఉంది. 

చదవండి : Jr NTR Birthday: రేపు అభిమానులకు ఆర్‌ఆర్‌ఆర్‌ సర్‌ప్రైజ్!
Pavala Syamala: పావలా శ్యామలకు మెగాస్టార్‌ చిరంజీవి సాయం

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు