Agent Movie: అఖిల్‌ 'ఏజెంట్' బ్యూటీ లుక్‌ ఇదే..

19 Jun, 2022 17:00 IST|Sakshi

అక్కినేని అఖిల్‌ హీరోగా నటిస్తున్న ఐదో చిత్రం 'ఏజెంట్'. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మాలీవుడ్ మెగాస్టార్‌ మమ్ముట్టి విలన్‌గా నటిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో జరుపుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి విడుదలైన పోస్టర్స్‌కు, అఖిల్‌ లుక్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 

తాజాగా ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోన్న సాక్షి వైద్య లుక్‌ను విడుదల చేశారు మేకర్స్‌. జూన్‌ 19న ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ పోస్టర్‌లో సాక్షి వైద్య జీన్స్‌ ప్యాంట్, బ్రౌన్ కలర్‌ టాప్‌తో ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం సాక్షి లుక్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఏజెంట్‌ సినిమా వరల్డ్‌వైడ్‌గా ఆగస్టు 12న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ మూవీ హాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మూవీ సిరీస్‌ 'బోర్న్‌' ఆధారంగా తెరకెక్కనుంది. వక్కంతం వంశీ కథ అందిస్తుండగా, హిప్‌ హాప్‌ తమిళ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. 

చదవండి: చెత్త ఏరిన స్టార్‌ హీరోయిన్‌.. వీడియో వైరల్‌
సాయి పల్లవి వివరణపై ప్రకాశ్‌ రాజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఆ హీరోలా ఎఫైర్స్‌ లేవు.. కానీ ప్రేమలో దెబ్బతిన్నా: అడవి శేష్‌

మరిన్ని వార్తలు