Acharya Movie: కాజల్‌కి ‘ఆచార్య’టీమ్‌ సర్‌ప్రైజ్‌

20 Jun, 2021 10:46 IST|Sakshi

చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శనివారం (జూలై 19) కాజల్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘ఆచార్య’లోని కాజల్‌ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో కాజల్ చాలా అందంగా కనిపిస్తోంది. పట్టు పరికిణీ లో అచ్చమైన తెలుగు అమ్మాయిలా అలరిస్తోంది. కీలక పాత్రల్లో రామ్‌చరణ్, పూజా హెగ్డే కనిపించనున్నారు.  ఇందులో దేవాదాయ శాఖ ఉద్యోగిగా చిరంజీవి నటిస్తున్నారు.
 
చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రంలో రామ్‌చరణ్‌ ఓ కీ రోల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. చెర్రి సరసన పూజా హెగ్డే కనిపిస్తారు. ఈ ఏడాది మే 13న విడుదల కావాల్సిన ‘ఆచార్య’ చిత్రం కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.

చదవండి:
హ్యాపీ బర్త్‌డే ‘చందమామ’ : కాజల్‌ సినీ ప్రయాణంపై స్పెషల్‌ వీడియో 

>
మరిన్ని వార్తలు