కోలీవుడ్‌లో పాగా వేస్తున్న 'ఆహా'.. ఆ సంస్థతో కలిసి సినిమా

9 Sep, 2022 10:10 IST|Sakshi

తమిళసినిమా: ఆహా ఓటీటీ సంస్థ జనరంజకమైన కార్యక్రమాలతో కోలీవుడ్‌లో  పాగా వేసేందుకు యత్నిస్తోంది. ఇతర చిత్రాలను కొనుగోలు చేసి విడుదల చేయడంతో పాటూ సొంతంగా కూడా చిత్రాలను కూడా నిర్మిస్తోంది. తాజాగా ఢీ కంపెనీ సంస్థతో కలిసి ఓ చిత్రాన్ని ప్రారంభింంది. ఢీ కంపెనీ సంస్థ అధినేత కేవీ దురై ఇంతకుముందు శింబు కథానాయకుడుగా నటింన ఈశ్వరన్, నటుడు జై, దర్శకుడు భారతీరాజా కలిసి నటించిన కుట్రం కుట్రమే చిత్రాలు కూడా ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే విడుదల చేశారు.

ప్రస్తుతం కుత్తుపత్తు అనే వెబ్‌సిరీస్‌ నిర్మాణంలో ఉంది. తాజాగా ఆహా సంస్థతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా కార్తీక్‌ శ్రీనివాస్‌ దర్శకుడుగా పరిచయమవుతున్నారు. ఇంతకు ముందు చార్లీ, సేతుపతి చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించిన లింగా ఈ చిత్రం ద్వారా కథానాయకుడుగా పరిచయమవుతున్నారు.

నటి గాయత్రి, అపర్ణ హీరోయిన్లుగా నటిస్తున్న ఇందులో వివేక్‌ ప్రసన్న, కేపీ ఎన్‌. దినా, నక్సలైట్‌ ధనం తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మదన్‌ క్రిస్టోఫర్‌ ఛాయాగ్రహణం, శక్తి బాలాజీ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్ర  ప్రారంభోత్సవానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై యూనిట్‌ శుభాకాంక్షలు అందచేశారు.

మరిన్ని వార్తలు