సరైన ఎంట్రీ

11 Jan, 2021 06:22 IST|Sakshi

‘బ్లఫ్‌ మాస్టర్‌’ వంటి హిట్‌ తర్వాత హీరో సత్యదేవ్, డైరెక్టర్‌ గోపీ గణేష్‌ పట్టాభి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘గాడ్సే’. సి.కె. స్క్రీన్స్‌ పతాకంపై సి.కల్యాణ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో మలయాళ నటి ఐశ్వర్యా లక్ష్మి తెలుగులో హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. తెలుగులో ఎంట్రీకి ‘గాడ్సే’ సరైన చిత్రం అంటున్నారు ఐశ్వర్య. ‘‘యాక్షన్‌ ప్యాక్డ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది. ఇప్పటివరకూ చేయని భిన్న తరహా క్యారెక్టర్‌లో సత్యదేవ్‌ నటిస్తుండగా, ఐశ్వర్యా లక్ష్మి కూడా నటనకి మంచి ఆస్కారం ఉండే పాత్రలో నటిస్తున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకి సహ నిర్మాత: సి.వి. రావు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: గోపీ గణేష్‌ పట్టాభి.

మరిన్ని వార్తలు