Aishwarya Lekshmi: అలాంటి చిత్రాలతో ఎలాంటి ప్రయోజనం లేదు: ఐశ్వర్య లక్ష్మి

5 Jun, 2023 07:12 IST|Sakshi

కట్టా కుస్తీ చిత్రంతో తమిళంలో పాపులర్‌ అయిన మలయాళీ నటి ఐశ్వర్య లక్ష్మి. ఇటీవల పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలో మెరిసిన ఈమె మాతృభాషలో నిర్మాతగానూ కొనసాగుతున్నారన్నది గమనార్హం. అక్కడ గార్గి వంటి పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. ఈమె ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ లేడీ ఓరియంటెడ్‌ కథా చిత్రాలపై తనకు పెద్దగా నమ్మకం లేదన్నారు.

(ఇది చదవండి: ఇండియన్‌ ఐడల్‌ 2 విన్నర్‌ ఆమెనే.. ఐకాన్‌ స్టార్‌ ప్రశంసలు)

కారణం స్త్రీల జీవితంలో పురుషులకు ప్రాముఖ్యత ఉంటుందన్నారు. కాబట్టి స్త్రీ, పురుషులకు సమానత్వం కలిగిన కథలతో కూడినదే మంచి చిత్రాలన్నది తన భావన అన్నారు. అలా కాని చిత్రాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. సినిమా అనేది మన జీవితాలను, సమాజాన్ని ప్రతిబింబించేలా ఉండాలన్నారు. కాబట్టి సినిమాల్లోనైనా, మన జీవితాల్లో నైనా సమానత్వం ఉండాలన్నారు. 

మరో విషయం ఏమిటంటే తాను ఈ రంగంలోకి ప్రవేశిస్తాననే ఊహించలేదన్నారు. వైద్య విద్యను పూర్తి చేసిన తాను సినిమాల్లో రావడం అన్నది దైవ నిర్ణయమే అన్నారు. కారణం తాను నటి నవుతానని కలలో కూడా ఊహించలేదన్నారు. తాను చదువుకు ప్రాముఖ్యత వచ్చే కుటుంబంలో పుట్టానన్నారు. వారికి సంబంధించినంత వరకు చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం చేయడమే సమాజంలో ఉన్నతస్థాయి అని పేర్కొన్నారు. సినిమా అలాంటి గౌరవాన్ని ఇచ్చేదిగా వారు భావించలేదన్నారు. నిజం చెప్పాలంటే సినిమాలో కొనసాగడం అనేది ప్రతినిత్యం పోరాటమేనని నటి ఐశ్వర్య లక్ష్మి పేర్కొన్నారు.

(ఇది చదవండి: నా అవార్డులను వాష్‌రూమ్‌ డోర్‌ హ్యాండిల్స్‌గా పెట్టా: నటుడు)

మరిన్ని వార్తలు