పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాలీవుడ్‌ బ్యూటీ

1 Dec, 2022 07:15 IST|Sakshi

మాలీవుడ్‌ బ్యూటీ ఐశ్వర్యలక్ష్మి మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ చిత్రాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. గార్గీ వంటి సక్సెస్‌ఫ/ల్‌ చిత్రంతో నిర్మాతగానూ మారారు. ఇటీవల అమ్ము అనే చిత్రంతో టైటిల్‌ పాత్ర పోషించింది. ఇది ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయి మంచి పేరును తెచ్చిపెట్టింది.

ఇక భారీ చిత్రం పొన్నియిన్‌ సెల్వన్‌లోనూ పూంగుళి అనే కీలక పాత్రలో నటించింది. ప్రస్తుతం తమిళం, మలయాళం భాషల్లో రెండేసి చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా విష్ణువిశాల్‌ జంటగా నటించిన కట్టా కుస్తా చిత్రం డిసెంబర్‌ 2వ తేదీ నుంచి తమిళం, తెలుగు భాషల్లో విడుదలకు సిద్ధం అవుతోంది.

ఇటీవల చెన్నైలో జరిగిన ఆడియో ఆవిష్కరణ వేదికపై నటి ఐశ్వర్య లక్ష్మి ఈ చిత్రం విజయంపై చాలా నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమంలో ముమ్మరంగా పాల్గొంటోంది. ఈ సందర్భంగా మీకు ప్రేమ వివాహం ఇష్టమా? పెద్దలు నిశ్చయించిన పెళ్లి ఇష్టమా? ప్రశ్నకు అసలు పెళ్లే ఇష్టం లేదని ఠక్కున బదులిచ్చింది.   

చదవండి: (రెండో పెళ్లికి సిద్ధమవుతున్న మీనా.. వరుడు అతడే?)

మరిన్ని వార్తలు