పొన్నియిన్‌ సెల్వెన్‌: ఐష్‌తో ప్రత్యేకంగా భారీ పాట, 400 మందితో..

14 Sep, 2021 09:05 IST|Sakshi

‘డోలా రే డోలా’, ‘కజ్‌రారే’, ‘తాళ్‌ సే తాళ్‌ మిలా’ వంటి పాటల్లో ఐశ్వర్యారాయ్‌ డ్యాన్స్‌ అదుర్స్‌ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఐష్‌ని అలాంటి మరో పాటలో చూసే అవకాశం ఉంది. మణిరత్నం దర్శకత్వంలో రపొందుతున్న ‘పొన్నియిన్‌  సెల్వన్‌’ చిత్రంలో యువరాణి నందిని పాత్ర చేస్తున్నారు ఐశ్వర్యారాయ్‌. ఇటీవల మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ సినిమా సెట్‌లో ఐశ్వర్యపై ఓ భారీ పాటను చిత్రీకరించారని సమాచారం.

చదవండి: ‘ఆ సన్నివేశాలు ఎంజీఆర్‌, జయలలితలను కించపరిచేలా ఉన్నాయి’

ఈ పాట కోసం స్పెషల్‌గా రిహార్సల్స్‌ కూడా చేశారట ఐశ్వర్య. కాస్ట్యమ్స్‌ విషయంలోన కేర్‌ తీసుకున్నారట. ఇంకో విశేషం ఏంటంటే... ఈ పాటలో ఐశ్వర్యతో పాటు నాలుగు వందల మందికిపైగా డ్యాన్సర్లు కనిపిస్తారని టాక్‌. గతంలో చేసిన ‘డోలా రే డోలా’, ‘కజ్‌రారే’, ‘తాళ్‌ సే తాళ్‌ మిలా’ పాటలకు ఐశ్వుర్య చప్పట్లు అందుకున్నారు. ఈ పాటలో నృత్యానికి ప్రేక్షకుల నుంచి మరోసారి ఆమె  చప్పట్లు అందుకోవడం ఖాయం అంటున్నారట చిత్రయూనిట్‌. విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, త్రిష తదితరులు నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు