Aishwarya Rai-Rajinikanth: ఐశ్వర్యపై నెటిజన్ల ప్రశంసల వర్షం, ఏం చేసిందంటే..

7 Sep, 2022 15:17 IST|Sakshi

మణిరత్నం అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం పొన్నియన్‌ సెల్వన్‌. సెప్టెంబర్‌ 30న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో మంగళవారం మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సందర్భందగా నిర్వహించిన ట్రైలర్‌ ఈవెంట్‌కు ‘తలైవా’ రజనీకాంత్‌, ‘లోకనాయకుడు’ కమల్‌ హాసన్‌లు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. అలాగే ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, జయం రవి, త్రిష, కార్తీ, ప్రభు తదితరలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవెంట్‌లో రజనీ పట్ల ఐశ్వర్య వ్యవహరించిన తీరుపై నెటిజన్లు, ‘తలైవా’ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

చదవండి: నాకు ఫోన్‌ కొనివ్వడానికి మా నాన్న అప్పు చేశారు: బిగ్‌బాస్‌ నేహా చౌదరి

ఈ సందర్భంగా ఈవెంట్‌లో రజనీకాంత్‌ను చూసిన ఐశ్వర్య వెంటనే ఆయన దగ్గరకు వెళ్లి పలకరించడమే కాదు ఆయన కాళ్లకు నమస్కరించింది అభిమానం చాటుకుంది. వెంటనే ఆమెను లేపిన రజనీ తనను ఆప్యాయంగా హత్తుకున్నారు. ఆతర్వాత ఒకరికి ఒకరు చేతులు జోడించి నమస్కారం తెలుపుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఫ్యాన్స్‌ పలు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలో షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. అంతేకాదు రజనీ పట్ల ఐశ్వర్య చూపించిన గౌరవానికి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ‘అందలోనే కాదు సంస్కారంలోనూ ఐశ్వర్యకు ఎవరు సాటిలేరు’, ‘ఐశ్వర్యే కాదు ఆమె మనసు కూడా చాలా అందమైనది’ అంటూ ఐశ్‌పై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. కాగా శంకర్‌ ‘రోబో’ చిత్రంలో రజనీకి జోడిగా ఐశ్వర్య నటించిన సంగతి తెలిసిందే. 

చదవండి: ఆస్పత్రి బెడ్‌పై షణ్ముఖ్‌ జశ్వంత్‌, ఫ్యాన్స్‌ ఆందోళన

మరిన్ని వార్తలు