ఐశ్వర్యరాయ్‌కి జిరాక్స్‌ కాపీలా ఉంది కదూ..

28 May, 2021 17:04 IST|Sakshi

ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది స్నేహా ఉల్లాల్. అచ్చం ఐశ్వర్యరాయ్‌లా కనిపించడం ఆమెకు మరింత ప్లస్‌ అయ్యింది. దీంతో అతి తక్కువ టైంలోనే తక్కువ టైంలో  పాపులారిటీ సంపాదించుకుంది. జూనియర్‌ ఐశ్వర్యగా యూత్‌లో మంచి క్రేజ్‌ను సంపాదిందచుకుంది ఈ ముద్దుగుమ్మ. అయిలా కెరీర్‌ పరంగా మాత్రం ఈ అమ్మడికి అంతగా కలిసిరాలేదు. వివిధ భాషల్లో దాదాపు 20 వరకు సినిమాలు చేసినా అంతగా గుర్తింపు రాలేదు. దీంతో అడపాదడపా సినిమాలు చేస్తూ ముందుకెళ్తుంది ఈ భామ.


తాజాగా స్నేహ ఉల్లాల్‌ షేర్‌ చేసిన ఓ ఫోటో ఆమెను మరోసారి వార్తల్లో నిలిచేలా చేసింది. బ్రైడల్‌ ఫోటో షూట్‌లో పాల్గొన్న స్నేహ ఉల్లాల్‌..నుదుట‌న పాపిట బిళ్ల‌, జుంకీలు, చేతి రింగ్‌తో అచ్చం జోధా అక్భర్‌లో ఐశ్వర్యరాయ్‌లా ఉంది. ఈ ఫోటోను స్నేహ ఉల్లాల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. దీంతో ఈ ఫోటో నెట్టింట తెగ వైరలవుతోంది. ఐశ్వర్యకు జిరాక్స్‌ కాపీలా ఉందే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. స్నేహ ఉల్లాల్‌ ఇటీవలె ‘ఎక్స్పైరీ డేట్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఇటీవలె బ్యాక్‌లెస్‌ ఫోటోను షేర్‌ చేసి ఇది  ‘నేను కాదు.. కానీ నేనే కావచ్చు’ అంటూ ఓ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోను షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. 

A post shared by Sneha Ullal (@snehaullal)

చదవండి : ఛాన్స్‌ వస్తే ఆ హీరోతో డేటింగ్‌కు వెళ్తా : రష్మిక
ప్రముఖ తెలుగు యాంకర్‌పై సోనూసూద్‌ ప్రశంసలు.. కారణమిదే..


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు