డ్రైవర్‌ జమున

11 Jan, 2021 04:05 IST|Sakshi

కొత్త సినిమా కోసం స్టీరింగ్‌ తిప్పడానికి రెడీ అయ్యారు ఐశ్వర్యా రాజేశ్‌. ఆదివారం ఐశ్వర్యా రాజేశ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తమిళంలో తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారామె. ‘డ్రైవర్‌ జమున’ అనే లేడీ ఓరియంటెడ్‌ సినిమా కమిట్‌ అయినట్టు తెలిపారు. ఈ సినిమాలో క్యాబ్‌ డ్రైవర్‌గా కనిపించనున్నారు ఐశ్వర్య. కి న్సిలిన్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ‘‘ఇలాంటి స్పెషల్‌ రోజున ఈ స్పెషల్‌ ప్రాజెక్ట్‌ను ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు ఐశ్వర్యా రాజేశ్‌. తెలుగులో నానితో ‘టక్‌ జగదీష్‌’లో కనిపించనున్నారు ఐశ్వర్యా రాజేశ్‌.

మరిన్ని వార్తలు