సమంత ప్లేస్‌లో‘వరల్ఢ్‌ ఫేమస్‌ లవర్‌’ నటి

19 Sep, 2020 16:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: 'కౌసల్య కృష్ణమూర్తి', 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రాలతో వెండితెరకు పరిచయమైన నటి ఐశ్వర్య రాజేశ్‌ ప్రస్తుతం తెలుగులో నానితో ‘టెక్‌ జగదీశ్‌’ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అంతేగాక తమిళంలో పలు ప్రాజెక్టులకు సంతాకాలు చేసిన ఐశ్వర్యకు చేతి నిండా సినిమాతో ఫుల్‌ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఆమె మరో లక్కీ ఛాన్స్‌ కొట్టేసింది. ఏకంగా సమంత స్థానంలో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఆర్‌ఎక్స్‌‌ 100 చిత్ర దర్శకుడు అజయ్‌ భూపతి తాజాగా తీస్తున్న మహా సముద్రం సినిమాలో శర్వానంద్‌కు జోడిగా ఐశ్వర్యను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్రకు మొదట దర్శకుడు సమంతను సంప్రదించినట్లు సమాచారం. ఆమెకు కథ వివరించగా పాత్ర నచ్చి ఒకే చెప్పినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

అయితే కొన్ని కారణాల వల్ల సమంత ఇటీవల ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో చివరకు ఈ పాత్రకు దర్శకుడు ఐశ్వర్య రాజేష్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కాగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించనున్న ఈ సినిమాలో మరో హీరోగా లవర్‌ బాయ్‌ సిద్దార్థ‌ నటింస్తున్నాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత తిరిగి సినిమాల్లో గ్రాండ్‌ ఏంట్రీ ఇవ్వనున్నాడు ఈ లవర్‌ బాయ్‌. ‘బొమ్మరిల్లు’, ‘నువ్వు వస్తానంటే.. నేనొద్దంటానా’తో తెలుగులో బ్లక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన సిద్దార్థ్‌కు ఆ తర్వాత సక్సెస్‌లు తక్కువే అని చెప్పుకొవచ్చు. 2016లో పలు సినిమాలతో పాటు తమిళ డబ్బింగ్‌ సినిమాల్లో నటించినప్పటికి అవి అంతగా గుర్తింపు పొందలేదు. దీంతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సిద్ధార్థ్‌ ‘మహా సముద్రం’తో ఎంట్రీ ఇస్తున్నాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా