మీ ఊహకే వదిలేస్తున్నాం!

9 Nov, 2020 03:00 IST|Sakshi

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పీరియాడికల్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత మళ్లీ చిత్రీకరణలో బిజీ అయింది ఈ టీమ్‌. సినిమాలోని కీలక సన్నివేశాలను హైదరాబాద్‌లోని ఓ ప్రత్యేక సెట్‌లో చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ఓ భారీ యాక్షన్‌ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన చిన్న వీడియోను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రబృందం తమ సోషల్‌ మీడియా అకౌంట్‌లో పంచుకుంది. ‘ఈ సన్నివేశం ఎలా ఉండబోతోందో మీ ఊహకే వదిలేస్తున్నాం’ అని క్యాప్షన్‌ చేశారు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఐశ్వర్య?
‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఆలియా భట్, ఒలీవియా మోరిస్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. వీరితో పాటు మరో కథానాయికగా ఐశ్వర్యా రాజేశ్‌ కనిపిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఆమె గిరిజన యువతిగా కనిపిస్తారని, ఎన్టీఆర్‌కు ఓ జోడీగా ఐశ్వర్య పాత్ర ఉంటుందని సమాచారం. చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

మరిన్ని వార్తలు