Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేశ్‌ ‘స్వప్న సుందరి’ షూటింగ్‌ పూర్తి

26 Sep, 2022 08:44 IST|Sakshi

హీరోయిన్‌ ఐశ్వర్య రాజేష్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘స్వప్న సుందరి’. వైవిధ్య భరిత పాత్రలకు కేరాఫ్‌గా ఉన్న నటి ఈమె. కాగా ఇంతకుముందు పలు భారతీయ చిత్రాలను విదేశాల్లో పంపిణీ చేసిన హంసిని ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ వ్యూ బాక్స్‌ స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్న తొలి తమిళ చిత్రం స్వప్న సుందరి. ఈ చిత్రానికి లాకప్‌ చిత్రం ఫేమ్‌ ఎస్‌.జీ.చార్లెస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నటి లక్ష్మీప్రియ, దీప శంకర్, కరుణాకర్, రెడిన్‌ కింగ్స్‌ లీ, మైమ్‌ గోపీ, సునీల్‌రెడ్డి, అగస్టీన్, బిజాన్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

బాలమురుగన్, విఘ్నేష్‌ రాజగోపాలన్‌ల ద్వయం ఛాయాగ్రహణం, విశాల్‌ చంద్రశేఖర్‌ నేపథ్య సంగీతాన్ని, అజ్మల్‌ పాటలకు సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది డార్క్‌ కామెడీ జానర్లో రూపొందిస్తున్న కథా చిత్రం అని తెలిపారు. నటి ఐశ్వర్య రాజేష్‌ చిత్రంలో వినోదభరిత పాత్రలో చాలా చక్కగా నటించారని చెప్పారు. చిత్ర కథ, కథనాలు సరికొత్తగా ఉంటాయన్నారు. చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. చిత్ర షూటింగ్‌ పూర్తి అయిందని, నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. త్వరలోనే చిత్ర టీజర్‌ను, సింగిల్‌ ట్రాక్‌ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు