అప్పా.. అమ్మా.. శుభాకాంక్షలు

27 Feb, 2021 01:00 IST|Sakshi
ఐశ్వర్య, రజనీకాంత్, లత

‘‘ఆమె అందర్నీ తన కుటుంబంలా భావించింది. ఆయన ఆమె కుటుంబాన్ని తన కుటుంబం అనుకున్నాడు. ఇద్దరూ కలసి ఒక మంచి కుటుంబం ఏర్పడటానికి కారణం అయ్యారు’’ అని  తన తల్లిదండ్రులు రజనీకాంత్, లత గురించి ఐశ్వర్య అన్నారు. ఫిబ్రవరి 28 రజనీ–లత నలభయ్యో వివాహ వార్షికోత్సవం. 1981లో ఈ ఇద్దరి పెళ్లి జరిగింది. నలభయ్యో వార్షికోత్సవం సందర్భంగా రజనీ–లతల పెద్ద కుమార్తె ఐశ్వర్యా ధనుష్‌ ఇన్‌ స్టాగ్రామ్‌లో ఈ విధంగా పేర్కొన్నారు.

‘‘ఒక విజయవంతమైన వైవాహిక జీవితానికి గల కారణాలను మా అమ్మానాన్న జీవితాలను చూసి తెలుసుకున్నాను. జీవితం అనే ప్రతి మలుపులోనూ మా గ్రాండ్‌ పేరెంట్స్‌ దేవదూతల్లా ఈ ఇద్దర్నీ కాపాడుకుంటూ వస్తున్నారని నా నామ్మకం. మ్యారేజ్‌ అంటే ఒకరి బాధ్యతను ఒకరు మోయడం అనే విషయాన్ని అమ్మానాన్నని చూసి తెలుసుకున్నాను. ఒక బంధం బలపడటానికి భార్యాభర్త మధ్య ఉండే స్నేహం కారణమవుతుందనే విషయం అర్థమైంది. వ్యక్తులుగా ఎదిగే ప్రతి దశలోనూ జీవితం తాలూకు ప్రతి విషయాన్ని నేర్చుకుంటూ, జీవితానికి అర్థం తెలుసుకుంటూ ఉంటాం’’ అంటూ అప్పా (నాన్న).. అమ్మా... మీ ఇద్దరికీ సూపర్‌ డూపర్‌ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు’’ అన్నారు ఐశ్వర్య.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు