Payal Rajput Mangalavaram Release Date: మంగళవారం రిలీజ్ డేట్ ఫిక్స్!

26 Sep, 2023 19:57 IST|Sakshi

ఆర్ఎక్స్ 100, మహా సముద్రం చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి తాజాగా తెరకెక్కిస్తోన్న మంగళవారం. ఈ సినిమాలో ఆర్ఎక్స్ 100 భామ పాయల్‌ రాజ్‌పుత్ లీడ్‌ రోల్‌లో పోషిస్తుండగా.. శ్రీతేజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మిస్తున్నారు. ఆర్‌ఎక్స్‌ 100తో సూపర్ హిట్‌ అందుకున్న అజయ్ భూపతి.. ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేక‌ర్స్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన 'మంగళవారం' నవంబర్ 17న విడుదల కానుంది.

(ఇది చదవండి: కాంతార ప్రీక్వెల్.. ఇప్పుడంతా దానిపైనే తెగ చర్చ!)

గ్రామీణ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెంచాయి. కాగా.. ఈ సినిమాలో  చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్, లక్ష్మణ్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి కన్నడ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. 

(ఇది చదవండి: టాలీవుడ్‌లో సూపర్‌ హిట్ జోడీ.. ఎంత చిలిపిగా ఉన్నారో చూడండి!!)

గతంలో దర్శకుడు అజయ్ భూపతి ఈ  సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. 'మంగళవారం' చిత్రాన్ని డిఫరెంచ్‌గా తెరకెక్కిస్తున్నట్లు అభివర్ణించారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరూ ప్రయత్నించని కాన్సెప్ట్‌తో ఈ సినిమా చేస్తున్నామని.. ఇందులో మొత్తం 30 పాత్రలున్నాయని తెలిపారు. ఆర్ఎక్స్ 100 తరహాలోనే అజయ్ ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు ఊహించని సర్ ప్రైజ్ ఇస్తాడని నమ్ముతున్నారు. ఈ సినిమాను నవంబర్ 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ారు.

మరిన్ని వార్తలు