అజయ్‌ దేవగన్ 30 ఇయర్స్‌ ఇండస్ట్రీ.. ఎమోషనల్‌ అయిన సింగం

22 Nov, 2021 11:57 IST|Sakshi

Ajay Devagn Completing 30 Years In Bollywood Industry: ముప్పై ఏళ్ల క్రితం ఒక సన్నగా ఉండే వ్యక్తి 'అగర్‌ తేరే పాస్‌ జాగీర్‌ హై, తో మేరే పాస్‌ జిగర్‌ హై' అని డైలాగ్‌ చెప్పి ప్రేక్షకుల మన్ననలను పొందాడు. ఆ వ్యక్తే బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవగన్‌. ఆయన తొలిచిత్రం 'ఫూల్‌ ఔర్‌  కాంటే'లోని ఈ డైలాగ్‌ అజయ్‌కు స్టార్‌డమ్‌ తీసుకొచ్చిన వాటిలో ఒకటి. నవంబర్‌ 22న అజయ్‌ దేవగన్‌ తన 30 సంవత్సరాల సినీ జీవితాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ ప్రయాణంలో 'జఖ్మ్‌, ఇష్క్‌, దిల్జాలే, హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌, ది లెజెండ్‌ ఆఫ్‌ భగత్‌ సింగ్‌, యువ, ఓంకార, సింగం, బోల్‌ బచ్చన్‌' వంటి చిత్రాల్లో అత్యత్తమైన నటనకౌశాలన్ని ప్రదర్శించారు. 

సమయం గడిచినా.. స్నేహం అలాగే ఉంటుంది: అక్షయ్‌

ఈ సందర్భంగా బీ టౌన్‌ సూపర్‌ స్టార్‌లు అమితాబ్‌ బచ్చన్‌, అక్షయ్‌ కుమార్‌ ట్విటర్‌లో అజయ్‌ దేవగన్‌కు శుభాకాంక్షలు తెలపుతూ ప్రత‍్యేక పోస్ట్‌లు పెట్టారు. 'అజయ్ దేవగన్‌ తన మొదటి చిత్రం 'ఫూల్‌ ఔర్‌ కాంటే' నవంబర్ 22న విడుదలవడంతో చలన చిత్ర పరిశ్రమలో 30 వసంతాలు పూర్తి చేసుకుంది. అజయ్‌ మృదుస్వభావి. అనవసర విషయాల్లో జోక‍్యం చేసుకోరు. ఇంకా సినిమా పట్ల మంచి అభిరుచి కలిగి ఉన్నారు. నా అభినందనలు అజయ్. మీరు మరో 70 ఏళ్ల పాటు కొనసాగాలని కోరుకుంటున్నా.' అంటూ బిగ్‌ బీ అమితాబ్‌ రాసుకొచ్చారు. మరోవైపు అక్షయ్‌ కుమార్‌ ఇలా 'మనం కొత్తవారిగా ఉన్నప్పుడు నాకు గుర్తుంది. నేను నువ్వు జుహు బీచ్‌లో మార్షల్‌ ఆర్ట్స్ సాధన చేసేవాళ్లం. మీ నాన్న మనకు శిక్షణ ఇచ్చేవారు. ఎంత మంచి రోజులవి. అలాగే నీ మొదటి చిత్రం 'ఫూల్‌ ఔర్‌  కాంటే ' వచ్చి 30 ఏళ్లు అవుతుంది. సమయం గడిచిపోతుంది. కానీ స్నేహం అలాగే ఉంటుంది.' ట్వీట్ చేశారు.

ఎమోషనల్‌ అవుతున్నా: అజయ్‌ 

'ఈ చిత్రం అజయ్‌ను చిత్రసీమకు పరిచయం చేయడమే కాకుండా రెండు బైక్‌లపై అతను ఇచ్చిన ఎంట్రీ సీన్ అప్పట్లో సంచలనంగా మారింది. 'ఫూల్‌ ఔర్‌ కాంటే' 30 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా ప్రత్యేకమైనది. ఈ చిత్రం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నా అరం‍గ్రేటం. ఆస్ట్రైడ్‌లో రెండు బైక్‌లపై ఎంట్రీ ఇవ్వడం నా కెరీర్‌లో చాలా ముఖ్యమైన ఘట్టం. ఆ కదిలై బైక్‌లపై స్టంట్‌ చేసినప్పుడు అనుభవించిన థ్రిల్‌ నాకు ఇప్పటికీ గుర్తుంది. అప్పటి నుంచి హిందీ సినిమా దాని పరిధులను విస్తృతం చేసుకుంటూ, అభివృద్ధి చెందుతోంది. ఈ పరిశ్రమలో భాగం కావడం నా అదృష్టం. 30 ఏళ్ల తర్వాత 'ఫూల్‌ ఔర్‌ కాంటే'ను మళ్లీ వీక్షించడం భావోద్వేగంగా అనిపిస్తుంది.' అని అజయ్‌ దేవగన్‌ తన అనుభవాలను పంచుకున్నారు. 

అజయ్‌ దేవగన్ బాలీవుడ్‌ ఇండస్ట్రీలో 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన తెరంగ్రేటం చేసిన 'ఫూల్‌ ఔర్‌ కాంటే' 'జీ బాలీవుడ్‌' ఛానెల్‌లో ఇవాళ సాయంత్రం 5.45 గంటలకు ప్రసారం కానుంది. ఈ చిత్రానికి 'వీరూ దేవగన్' దర్శకత్వం వహించారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో అజయ్‌ దేవగన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. 

చదవండి: కళ్లు చెదిరే రేటుకు అజయ్‌ కొత్త బంగ్లా!

మరిన్ని వార్తలు