దేవుడా ధన్యవాదాలు!

8 Jan, 2021 11:36 IST|Sakshi

ఏదైనా ప్రమాదం నుంచి తప్పించుకుంటే ‘థ్యాంక్‌ గాడ్‌’ అంటుంటాం. ఇప్పుడు అజయ్‌ దేవగణ్, రకుల్‌ ప్రీత్‌ సింగ్, సిద్ధార్థ్‌ మల్హోత్రాలు కూడా ధన్యవాదాలు దేవుడా అంటున్నారు. మరి వీరు ఏ విపత్తు నుంచి తప్పించుకున్నారో తెలియాలంటే సినిమా వచ్చేదాకా ఆగాల్సిందే. అజయ్‌ దేవగణ్, రకుల్, సిద్ధార్థ్‌ ముఖ్య పాత్రల్లో తెరకెక్కనున్న హిందీ చిత్రం ‘థ్యాంక్‌ గాడ్‌’. ఇంద్ర కుమార్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా ఈ నెల 21న సెట్స్‌ మీదకు వెళ్లనుంది. వినోద ప్రధానంగా సాగే సినిమా ఇది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమాను థియేటర్స్‌లోకి తీసుకురానున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. 

మరిన్ని వార్తలు