Ajay Devgn daughter Nysa: తప్పతాగిన స్టార్ హీరో కూతురు.. నెటిజన్ల దారుణ ట్రోల్స్

26 Dec, 2022 16:47 IST|Sakshi

బాలీవుడ్ సెలబ్రిటీలు వారాంతం వచ్చిందంటే ఎంజాయ్ చేయడం మామూలే.  పబ్‌లు, నైట్ పార్టీలకు కొదవే లేదు. అయితే ఇటీవల బాలీవుడ్ స్టార్‌ నటుల పిల్లలు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. బాలీవుడ్‌ కల్చర్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.  ఇటీవల సుహానా ఖాన్, ఖుషి కపూర్ ఓ పార్టీలో సందడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అజయ్‌ దేవగణ్‌ కూతురు నైసా దేవగణ్ తన ఫ్రెండ్‌ ఓర్హాన్‌ అవత్రమణితో ముంబైలో పార్టీకి వెళ్లిన ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఎందుకంటే వారిద్దరూ వీడియోలో తప్పతాగి కనిపించారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు.  ఇబ్రహీం అలీ ఖాన్, ఖుషీ కపూర్, మహికా రాంపాల్,  ఇతర స్టార్‌కిడ్‌లు కూడా పార్టీలో కనిపించారు.

నైసా దేవగణ్, ఓర్రీ చేతులు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నడుస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.  ఇది చూసిన ఫ్యాన్స్ వారిద్దరూ తప్ప తాగి ఉన్నారంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేశారు.  ఓ నెటిజన్  తల్లిదండ్రులు కష్టపడి పేరు సంపాదిస్తే.. వారి పిల్లలు వాటిని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. మరో నెటిజన్ నైసా దేవగణ్ ఫుల్‌గా తాగి ఉందంటూ పేర్కొన్నాడు. దుస్తులు, మేకప్, ఓపెన్ హెయిర్, బోల్డ్ మేకప్‌తో ఆమె తన రూపాన్ని మార్చేసిందని కామెంట్స్‌ చేశారు .నైసా దేవగణ్.. అజయ్, కాజోల్‌లకు మొదటి సంతానం. ఈ దంపతులకు తొమ్మిదేళ్ల కుమారుడు యుగ్ కూడా ఉన్నాడు. 

A post shared by Viral Bhayani (@viralbhayani)


 

మరిన్ని వార్తలు