RGV: సుదీప్‌కు వర్మ మద్దతు, బాలీవుడ్‌ హీరోలపై సంచలన కామెంట్స్‌

28 Apr, 2022 17:47 IST|Sakshi

హిందీ భాషపై కన్నడ హీరో కిచ్చా సుదీప్‌ చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమల్లో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. హిందీ జాతీయ భాష కాదంటూ సుదీప్‌ చేసిన కామెంట్స్‌కు బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగన్‌ ట్విటర్‌ వేదికగా కౌంటర్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో అజయ్‌, సుదీప్‌ల మధ్య బుధవారం ట్వీట్ల వార్‌ నెలకొంది. ఈ వార్‌పై తాజాగా వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ స్పందించాడు. ఈ మేరకు సుదీప్‌కు మద్దతు ఇస్తూ ఉత్తరాది హీరోలు దక్షిణాది హీరోలను చూసి అసూయ పడుతున్నారంటూ సంచలన కామెంట్స్‌ చేశాడు.

చదవండి: హిందీ భాషపై సంచలన వ్యాఖ్యలు, అజయ్‌, సుదీప్‌ మధ్య ట్వీట్ల వార్‌

‘సౌత్‌, నార్త్‌ అనేది ముఖ్యం కాదు. భారతదేశం అంతా ఒకటే అనేది ప్రతి ఒక్కరూ గ్రహించాలి’ అని తొలుత హితవు పలికాడు వర్మ. అనంతరం తన వ్యాఖ్యలకు అర్థం అది కాదని, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారని సుదీప్‌ చేసిన ట్వీట్‌కు ఆర్జీవి రీట్వీట్‌ చేశాడు. ‘మీ అభిప్రాయం ఏదైనా కావచ్చు సుదీప్‌ సర్‌. కానీ మీరు ఈ కామెంట్స్‌ చేసినందుకు సంతోషం. ఎందుకంటే బాలీ(నార్త్‌)వుడ్‌, శాండల్‌(సౌత్‌)వుడ్‌ మధ్య ఇలాంటి విభేదాలు వచ్చినప్పుడు సైలెంట్‌గా ఉండటం సరికాదు’ అంటూ రాసుకొచ్చాడు.

చదవండి: హీరో నిఖిల్‌ ఇంట తీవ్ర విషాదం

అనంతరం మరో ట్వీట్‌ చేస్తూ.. ‘అసలు నిజం ఏంటంటే... బాలీవుడ్‌లో కేజీయఫ్‌ 2 రూ. 50 కోట్ల ఓపెనింగ్‌ కలెక్షన్స్‌తో రికార్డు క్రియేట్‌ చేయడంతో బాలీవుడ్‌ స్టార్స్‌, సౌత్‌ స్టార్స్‌ను చూసి అసూయతో ఉన్నారన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన నిజం. ఇకపై బాలీవుడ్‌ చిత్రాల ఓపెనింగ్స్‌ ఎలా ఉంటాయో మనం కూడా చూద్దాం. బాలీవుడ్‌లో బంగారం ఉందా?, కన్నడలో బంగారం ఉందా? అనేది ‘రన్‌వే 34’ ఓపెనింగ్‌ కలెక్షన్స్‌తో అర్థమైపోతుంది’ అంటూ వరుస ట్వీట్స్‌ చేశాడు వర్మ. ప్రస్తుతం వర్మ కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  వర్మ కామెంట్స్‌పై బాలీవుడ్‌ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తి నెలకొంది. 

చదవండి: అర్థరాత్రి 12 గంటలకు.. సమంతకు విషెస్‌ చెప్పిన హీరో

కాగా కేజీయఫ్‌ 2 సక్సెస్‌ మీట్‌లో సుదీప్‌ మాట్లాడుతూ.. ఒక కన్నడ సినిమాను పాన్ ఇండియాగా తెరకెక్కించారని ఎవరో అంటున్నారని, ఇక్కడ చిన్న కరెక్షన్‌ ఉందంటూ ‘హిందీ ఇక నుంచి ఏమాత్రం జాతీయ భాష కాదు’ అన్నాడు. అలాగే బాలీవుడ్‌ ఎన్నో పాన్‌ ఇండియా సినిమాలను నిర్మించి తెలుగు, తమిళంలో డబ్ చేసేందుకు ఎంతో కష్టపడుతున్నారంటూ కామెంట్‌ చేశాడు. దీనికి అజయ్‌ దేవగన్‌ ‘హిందీ జాతీయ భాష కాకపోతే మీ సినిమాలను హిందీలో డబ్‌ చేసి ఎందుకు విడుదల చేస్తున్నారు. హిందీ ఇప్పటికీ, ఎప్పటికీ మన మాతృ భాషే, జాతీయ భాషే, జనగణమన’ అంటూ సుదీప్‌కు కౌంటర్‌ ఇచ్చాడు. 

మరిన్ని వార్తలు