తమన్నా కోసం ఆ టాప్‌ హీరోయిన్‌ను టార్గెట్‌ చేసిన అజిత్‌

31 Jul, 2023 08:20 IST|Sakshi

ఎవరైనా సక్సెస్‌ వెనుక పరిగెత్తం సాధారణ విషయమే. ఇక చిత్రాల విషయాని కొస్తే క్రేజ్‌ చాలా అవసరం. నటుడు అజిత్‌ కూడా ఈ పాలసీనే ఫాలో అవుతున్నారా..? అంటే అయ్యుండొచ్చు అనే కోలీవుడ్‌ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈయన నటించిన తాజా చిత్రం తుణివు (తెగింపు) విడుదలై దాదాపు ఏడాది కావస్తోంది. ఇంతవరకు ఆయన తదుపరి చిత్రం ప్రారంభం కాలేదు. విడాముయిర్చి అనే చిత్రంలో నటిస్తున్నట్లు ప్రకటించి చాలా కాలమే అయ్యింది. దీనికి ఆది నుంచి ఆటంకాలే ఎదురవుతున్నాయి.

(ఇదీ చదవండి: జైలర్‌కు 'తెలుగు' సెంటిమెంట్‌.. రజనీకాంత్‌కు అసూయ ఎందుకు?)

మొదట నయనతార భర్త విగ్నేష్‌ శివన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధమయ్యారు. అందుకు సన్నహాలు కూడా చేసుకున్నారు. అలాంటి దశలో అనుహ్యంగా ఆయన్ని చిత్రం నుంచి తొలగించడం జరిగింది. ఈ విషయంలో అజిత్‌ ప్రమేయం ఉందనే ప్రచారం జరిగింది. వాస్తవం ఏమిటి అన్నది తెలియకపోయినా ఆ తరువాత విడాముయిర్చి చిత్ర యూనిట్‌ లోకి దర్శకుడు మగిళ్‌ తిరుమేణి వచ్చారు. దీంతో ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభ పనులు వేగవంతం అవుతాయని అందరూ భావించారు.

అయితే ఈ చిత్ర షూటింగ్‌ ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. ఇంతకుముందే ఆగస్టు తొలి వారంలో విడాముయిర్చి సెట్స్‌ పైకి వెళుతుందని చెప్పారు. అయితే ఇది మరోసారి వాయిదా పడినట్టు, సెప్టెంబర్‌ నెలలో ప్రారంభం కానున్నట్లు తాజా సమాచారం. అసలు ఈ చిత్రం విషయంలో ఏం జరుగుతుందనే గందరగోళ వాతావరణం అజిత్‌ అభిమానుల్లో నెలకొంది. ఇకపోతే ఈ చిత్రం షూటింగ్‌ పలుమార్లు వాయిదా పడటంతో ఇందులో నాయకిగా నటించాల్సిన త్రిష ఇతర చిత్రాలతో బిజీ అవ్వడం జరిగిపోయింది.

(ఇదీ చదవండి: వాళ్లను చూస్తే నాకు ఎప్పుడూ గర్వంగానే ఉంటుంది: చిరంజీవి)

ఆమె అజిత్‌ చిత్రానికి కాల్‌ షీట్స్‌ సర్దుబాటు చేయలేని పరిస్థితి అనీ అయినప్పటికీ కాస్త ఆలస్యం అయినా ఎలాగో అలా విడాముయిర్చి చిత్రంలో నటిస్తానని త్రిష చెప్పినట్లు సమాచారం. అయితే నటుడు అజిత్‌ ఆమెకు అడ్డుపడుతున్నట్లు తాజాగా సామాజిక మాధ్యమాలలో వైరలవుతోంది. ఆయన దృష్టి ఇప్పుడు నటి తమన్నపై పడిందట. కారణం జైలర్‌ చిత్రంలోని కావాలా పాటతో ఫుల్‌ క్రేజ్‌ తెచ్చుకోవడమే అని టాక్‌. అజిత్‌ అంటేనే తమిళ పరిశ్రమలో పవర్‌ హౌస్‌ లాంటోడు.

అలాంటిది మరోక హీరోయిన్‌కు వచ్చిన క్రేజ్‌ను సొంతం చేసుకోవాలనే మోజులో ఉండటం మంచిది కాదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. త్రిష కూడా తమన్నా క్రేజ్‌కు ఏ మాత్రం తక్కువ కాదని వారు తెలుపుతున్నారు. కాగా అజిత్‌ చిత్రంలో నటించే నాయకి ఎవరన్నది చిత్రవర్గాలు ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు