బైక్‌పై భారీయాత్రకు సిద్ధమైన స్టార్ హీరో!

19 Jan, 2021 11:36 IST|Sakshi

నటుడు అజిత్ ఇటీవల తన రాబోయే తమిళ చిత్రం వాలిమై యొక్క హైదరాబాద్ షెడ్యూల్ ను పూర్తీ చేసాడు. తర్వాత తుది షెడ్యూల్ కోసం "వాలిమై" చిత్ర బృందం మొరాకోకు వెళ్లనున్నారు. ఈ గ్యాప్ లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ భారీ బైక్ యాత్రకు సిద్దమయ్యాడు. హీరో అజిత్‌కు బైక్‌లు, రేసింగ్ అంటే ఎంత పిచ్చో మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. వీలైనంత వరకు తను బైక్ ప్రయాణాల వైపే అజిత్ మొగ్గు చూపుతాడు. ఆ మధ్య తాను షూటింగ్ పూర్తీ అయ్యాక తిరుగు ప్రయాణంలో బైక్ మీద హైదరాబాద్ నుంచి చెన్నైకి బయలుదేరిన సంగతి మనకు తెలిసిందే.(చదవండి: అజిత్‌తో ఉన్నది ఎవరో తెలుసా?)

తాజాగా ఇప్పుడు అజిత్ చెన్నై నుంచి సిక్కింకు(2400కి.మీ) బైక్‌పై వెళ్లనున్నట్టు సమాచారం. ఈ నెలాఖరుకు చెన్నై తిరిగి రానున్నాడు. సోలోగా 4500 కి.మీ బైక్ యాత్ర చేయాలని అజిత్ ప్లాన్ చేసుకున్నారు. ఈ రోడ్ ట్రిప్లో వారణాసి దగ్గర ఒక అభిమానితో దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లీక్ అయిన చిత్రంలో అజిత్ బిఎండబ్ల్యూ బైక్ నడుపుతూ శీతాకాలపు బట్టలు ధరించి కనిపించాడు. ఈ పర్యటన నుండి తిరిగి వచ్చిన తరువాత అతను "వాలిమై" తుది షెడ్యూల్ కోసం మొరాకోకు వెళ్లనున్నారు. చిత్రంలో అజిత్ పోలీస్ పాత్రలో కనిపించనుండగా, ఇందులో కథనాయికగా బాలీవుడ్ నటి హుమా ఖురేషి నటిస్తుంది. టాలీవుడ్ హీరో కార్తికేయ విలన్‌గా కనిపించనున్నారు.
 

మరిన్ని వార్తలు