Ajith Kumar: అజిత్ కుమార్ దాతృత్వం.. తోటి రైడర్‌కు బీఎండబ్ల్యూ బైక్!

24 May, 2023 18:21 IST|Sakshi

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గురించి దక్షిణాదిలో పరిచయం అక్కర్లేదు. దళపతి విజయ్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న హీరోగా గుర్తింపు పొందాడు. తెలుగులోనూ ఆయనకు ఫ్యాన్స్ భారీగానే ఉన్నారు. కాగా.. ఇటీవలే అజిత్ బైక్‌పై దేశంలో ప్రధాన నగరాలను చుట్టేశారు. అంతేకాకుండా నేపాల్‌ టూర్‌కు కూడా వెళ్లారు. భూటాన్‌, నేపాల్‌, యూరప్‌లోని కొన్ని నగరాల్లో బైక్‌పై విహార యాత్ర చేశారు. అయితే అజిత్ నేపాల్ విహార యాత్రలో ఉండగా.. తోటి రైడర్ సుగత్ సత్పతి ఆయనకు సహాయంగా నిలిచారు. 

(ఇది చదవండి: ఫస్ట్‌ సినిమాకే లక్ష అడిగా... కానీ చిరంజీవి..: పొన్నంబలం)

దీంతో అజిత్ తన తోటి రైడర్ సుగత్ సత్పతికి రూ.12.5 లక్షల విలువైన బిఎమ్‌డబ్ల్యూ సూపర్ బైక్‌ను బహుమతిగా ఇచ్చాడు. టూర్‌లో సాయం చేసినందుకు కృతజ్ఞతగా అతనికి బైక్‌ను కొనిచ్చాడు. ఈ విషయాన్ని సుగత్ తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఆయనతో దిగిన చిత్రాలను కూడా పంచుకున్నారు. హీరో అజిత్‌ను ప్రశంసిస్తూ పోస్ట్ చేశారు. నేను చాలా అదృష్టవంతుడినని.. తమిళ సినీ పరిశ్రమలోని బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌ అజిత్ కుమార్‌తో టచ్‌లో ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నా అంటూ ఆనందం వ్యక్తం చేశారు. కాగా.. అజిత్ ఇటీవలే తునివు చిత్రంలో కనిపించారు. తెలుగులో తెగింపు పేరుతో ఈ మూవీ విడుదలైంది.

(ఇది చదవండి: నిన్ను చూడాలని, నీ చేతిముద్ద తినాలనుంది: బుల్లితెర నటి ఎమోషనల్)

A post shared by Sugat Satpathy (@wanderlustsatpathy)

మరిన్ని వార్తలు