విఘ్నేశ్‌ డైరెక్షన్‌లో అజిత్‌-త్రిష చిత్రం.. ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌

26 Dec, 2022 08:56 IST|Sakshi

తమిళసినిమా: కోలీవుడ్‌లో జయాపజయాలకు అతీతంగా చిత్రాలు చేసుకుంటూ పోయే నటుడు అజిత్‌. 'నీ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించు. ఫలితం అదే వస్తుంది' అన్న సిద్ధాంతాన్ని పాటించే నటుడు ఈయన. అదేవిధంగా తాను నటిస్తున్న చిత్రాల గురించి ఎలాంటి విషయాన్ని చెప్పరు. ఆడంబరాలకు పోరు. అభివనులను ప్రోత్సహించారు. అందుకే అజిత్‌ రూటే సెపరేటు అనే ప్రచారం ఉంది. తాజాగా ఈయన నటించిన తుణివు చిత్రం పొంగల్‌ బరిలోకి దిగుతోంది. జి సినిమా సంస్థతో కలిసి బాలీవుడ్‌ నిర్మాత బోని కపూర్‌ నిర్మించిన ఈ చిత్రానికి హెచ్‌. వినోద్‌ దర్శకుడు.

నటి మంజు వారియర్‌ నాయకిగా నటించిన ఈ చిత్రం బ్యాంక్‌ రాబరీ నేపథ్యంలో సాగే కథగా ఉంటుందని సమాచారం. దీన్ని ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థ విడుదల చేస్తోంది. దీంతో తుణివు చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే అజిత్‌ నటించే తదుపరి చిత్రం షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభమవుతుందనే ఆసక్తి ఆయన అభివనుల్లో నెలకొంది. ఎందుకంటే అజిత్‌ తుణివు చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత 180 రోజుల పాటు బైక్‌లో సుదీర్ఘ విదేశీ ప్రయణానికి సిద్ధమవుతున్నట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది.

అయితే ఆయన అభిమానులకు ఆనందాన్ని కలిగించే ఒక వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అజిత్‌ తదుపరి విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసింది. నటి త్రిష నాయకిగా నటించనున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది. కాగా ఈ చిత్రం జనవరిలో సెట్‌ పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

మరిన్ని వార్తలు