Ajith: పెళ్లి చేసుకుంటానని హీరోయిన్‌ ఇంటికి వెళ్లిన అజిత్‌.. షాలిని కంటే ముందు ఆమెతో రొమాన్స్‌

1 Oct, 2023 09:46 IST|Sakshi

తమిళ చిత్రసీమలో జెంటిల్‌మన్ గుర్తింపు ఉన్న అతికొద్ది మంది నటుల్లో హీరో అజిత్ కుమార్ ఒకరు. అజిత్ తన కెరీర్‌తో పాటు కుటుంబ జీవితంలో కూడా ఎలాంటి వివాదాలు లేకుండా ముందుకు వెళ్తున్నాడు. అజిత్ లాంటి భర్త కావాలని కోలివుడ్‌లో కలలు కనే యువతులు ఎందరో ఉన్నారు.పెళ్లయి 23 ఏళ్లు గడిచినా అజిత్‌కు భార్య షాలినిపై ప్రేమ తగ్గలేదు. ఆదర్శ జంటల జాబితాలో అజిత్- షాలిని పేరు మొదటగా వినిపిస్తుంది. కానీ  అజిత్ వ్యక్తిగత జీవితం గురించి అభిమానులకు పెద్దగా తెలియదు. ఆయనకు వచ్చిన స్టార్‌డమ్‌ని తలకు ఎక్కుంచుకునే వ్యక్తి కాదు.  అజిత్ ఒక సినిమాని పూర్తి చేసిన తర్వాత, దాని గురించి అన్ని ఆలోచనలను విడిచిపెట్టి, తనకు ఇష్టమైన బైక్‌పై రైడ్‌కు వెళతాడు. అజిత్ కూడా తన సినిమా ప్రమోషన్ కోసం ఎప్పుడూ వేదికపైకి కూడా రాడు.

అజిత్ తన అభిరుచిని కొనసాగించడంలో భార్య షాలిని నుంచి ఎక్కువ మద్దతు ఉంది. అజిత్ షాలినిని సినిమా ద్వారా సంపాదించిన నిధిగా చూస్తాడు. అజిత్ 2000లో షాలినిని పెళ్లాడాడు. అమర్‌కలం సినిమాలో షాలినితో కలిసి నటించిన తర్వాతే అజిత్ ప్రేమలో పడ్డాడని, ఆ విషయాన్ని షాలినితో చెప్పాడు. తరువాత, రెండు కుటుంబాలు ఈ సంబంధానికి మద్దతు ఇచ్చాయి. తర్వాత పెళ్లితో అజిత్- షాలిని కలిసి జీవితాన్ని ప్రారంభించారు. 

 
(నటి హీరా రాజగోపాల్‌తో అజిత్)

అజిత్‌కు సినిమా ఛాన్స్‌లు ఇప్పించిన హీరోయిన్‌
షాలిని కంటే ముందు అజిత్ మరొక హీరోయిన్‌తో రొమాన్స్ చేశాడని కోలీవుడ్‌లో ప్రచారంలో ఉంది. తమిళ నటి హీరా రాజగోపాల్‌తో అజిత్ ప్రేమలో ఉన్నాడని అప్పట్లో భారీగానే వార్తలు వచ్చాయి. ఆమె తెలుగు మూలాలు ఉన్నా కోలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. అజిత్‌ కెరియర్‌ ప్రారంభంలో ఆమె పలు సినిమా అవకాశాలు ఇప్పించినట్లు ప్రచారం ఉంది. అయితే వారిద్దరి మధ్య విబేదాలు రావడంతో హీరాతో అజిత్‌ బ్రేకప్‌ చెప్పేశాడట. ప్రేమ బ్రేకప్ అయిన తర్వాత అజిత్ జీవితంలోకి షాలిని వచ్చిందని టాక్‌. ఇదే విషయాన్ని కోలీవుడ్‌ నటుడు, సినీ విమర్శకుడు బైల్వాన్ రంగనాథన్ ఇలా వెల్లడించారు. 

(ఇదీ చదవండి: సౌత్‌లో ఈ హీరోయిన్ల రెమ్యునరేషన్‌ ఎంతంటే.. టాప్‌లో ఎవరో తెలుసా?)

'1996లో తమిళ్‌లో వచ్చిన 'వాన్మతి' సినిమాలో హీరోయిన్‌గా నటించిన స్వాతిని కూడా అజిత్ ప్రేమించాడు. ఒకానొక సమయంలో స్వాతిని పెళ్లి చేసుకోవాలనే కోరికతో అజిత్ ఆమె కుటుంబాన్ని సంప్రదించాడు. అయితే దీనికి నటి కుటుంబం అంగీకరించకపోవడంతో అజిత్ ఆ సంబంధాన్ని విడిచిపెట్టాడు' అని బెయిల్వాన్ రంగనాథన్ చెప్పారు. కానీ అజిత్‌ జీవితంలో తొలిప్రేమ మాత్రం హీరా రాజగోపాల్‌ అనే ఆయన చెప్పాడు. అప్పట్లో మోహన్‌లాల్‌ నిర్వాణం చిత్రంలో కథానాయికగా నటించి మలయాళీ హృదయాలను కొల్లగొట్టిన నటి ఆమె. హీరాకు అప్పట్లో భారీగా ఫ్యాన్స్‌ ఉండేవారు.


(వాన్మతి నటి స్వాతితో అజిత్‌) 

హీరాతో అజిత్ గాఢమైన ప్రేమలో ఉన్నాడని. ఆమెను అజిత్ పెళ్లి చేసుకోనున్నాడని ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది. అంతేకాకుండా వీరిద్దరూ కూడా చాలా చనువుగా ఉండేవారని పలు ఫోటోలు కూడా వైరల్‌ అయ్యాయి. వీరిద్దరూ తొలిసారి కలిసి నటించిన 'కథల్ కొట్టాయ్' సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారని తెలుస్తోంది. సెట్‌లో హీరాకు అజిత్ ప్రేమలేఖలు కూడా రాసినట్లు పుకార్లు వచ్చాయి. తర్వాత వారిద్దరితో బ్రేకప్‌ అవడంతో.. 2000 సంవత్సరంలో  అజిత్‌-షాలినిని పెళ్లి చేసుకోవడం జరిగినట్లు వార్తలు వచ్చాయి.


(షాలినితో అజిత్‌ పెళ్లి ఫోటోలు)

అజిత్ ఎవరితో జోడీ కట్టినా షాలినీకి ఎవరూ సాటిరారని, అజిత్‌కి షాలినీ పర్ఫెక్ట్ పెయిర్ అని ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. అజిత్‌తో వివాహం అయిన తర్వాత శాలిని నటనకు దూరమైంది. ఇప్పుడు షాలిని మంచి కుటుంబ మహిళగా తన పాత్ర పోషిస్తుంది. తాజాగా షాలిని సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసింది. షాలిని సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండటంతో అభిమానులు అజిత్‌కు సంబంధించిన విషయాలను సులభంగా తెలుసుకోవచ్చు. తునివ్ (తెగింపు) అజిత్ నటించిన చివరి సినిమా.. తన తర్వాతి ప్రాజెక్ట్‌ విధముయిర్చి ఈ సినిమా కూడా పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల అవుతుంది.

మరిన్ని వార్తలు