అజిత్‌ షూట్‌ చేశాడు.. మెడల్‌ ఇచ్చారు

9 Mar, 2021 07:47 IST|Sakshi

తమిళ సూపర్‌స్టార్‌ అజిత్‌ కేవలం మేకప్పే జీవితం అనుకునే టైప్‌ కాదు. డబ్బు లెక్కపెట్టుకోవడమే జీవిత పరమార్థం అనుకోడు. కార్‌ రేసింగ్, స్పోర్ట్స్, బైక్‌ రైడింగ్‌... వంటివి ఎంజాయ్‌ చేస్తాడు. వాటిని సీరియస్‌గా సాధన చేసి పోటీల్లో కూడా పాల్గొంటాడు. అలాంటి కార్‌ రేస్‌ వల్లే పెద్ద ప్రమాదం జరిగి గతంలో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు అజిత్‌ అభిమానులు పొంగిపోయే సందర్భం వచ్చింది. మార్చి 2 నుంచి 7 వ తేదీల మధ్య చెన్నైలో స్టేట్‌ షూటింగ్‌ కాంపిటీషన్‌ జరిగింది.

రాష్ట్రం మొత్తం నుంచి 900 మంది షూటర్స్‌ పాల్గొన్నారు. చెన్నై రైఫిల్‌ క్లబ్‌ సభ్యుడు అయిన అజిత్‌ మరో నలుగురు సభ్యుల బృందంతో షూటింగ్‌ కాంపిటీషన్‌లో పాల్గొన్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 మెడల్స్‌ సొంతం చేసుకున్నాడు. ‘ఫైర్‌ పిస్టల్‌’, ‘ఫ్రీ పిస్టల్‌’, ‘స్టాండర్డ్‌ పిస్టల్‌’ తదితర విభాగాలలో ఈ మెడల్స్‌ వచ్చాయి. పోటీకి ముందు కొన్ని రోజులు ఉదయాన్నే రైఫిల్‌ క్లబ్‌కు వచ్చి షూటింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడతడు. మెడలో మెడల్స్‌ వేసుకున్న అజిత్‌ కటౌట్‌కు నిమ్మకాయల దండ వేసుకున్నంత అందంగా అభిమానులకు కనిపించాడు.

చదవండి: వుమెన్స్‌ డే: అనుష్క, కూతురు ఫోటోతో కోహ్లి భావోద్వేగం

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు